ఖమ్మం

పోడుపై దద్దరిల్లిన ఐటిడిఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వారావుపేట,, జూలై 1: గిరిజనాభివృద్ధికి అవసరమైన పథకాలు.. నిధులు..చేసిన ఖర్చులు..ఇంకా కావాల్సిన ప్రణాళికలు గురించి చర్చించేందుకు అశ్వారావుపేటలో శుక్రవారం నిర్వహించిన ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో అడుగడుగునా ఆంక్షలతో గందరగోళానికి దారితీసింది. ఇరుకుగదిలో సమావేశం నిర్వహించి అందులో కనీసం పాత్రికేయులకు కూడా ప్రవేశం లేకుండా బయటకు పంపించేశారు. అజెండాలోని అంశాలకు సంబంధించి విద్య, వైద్యం, సంక్షేమం, అటవీహక్కుల చట్టానికి సంబంధించిన అధికారులే సమావేశంలో పాల్గొనాలని కూర్చున్న వారిని కూడా బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో మంత్రులు, ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బయట జోరున వర్షం కురుస్తుంటే అధికారులు, పాత్రికేయుల చెట్ల కింద నానా పాట్లు పడాల్సి వచ్చింది. పాలకమండలి సమావేశంలో ప్రధానంగా పోడు భూములపై సభ్యులు విరుచుకుపడ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చివరకు గిరిజన మంత్రి చందూలాల్ కూడా అటవీశాఖ తీరును తప్పుబట్టారు. సాగు చేసుకుంటున్న గిరిజనులు భూముల్లోకి వెళ్లి నానా బీభత్సం సృష్టిస్తున్నారని సభ్యులు వాపోయారు. సుమారు గంట సేపు దీనిపై చర్చ జరిగింది. చివరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2004కు ముందు పోడు చేసుకుంటున్న గిరిజనులు జోలికి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది. ఇక మిగిలిన సాంకేతిక అంశాలను ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధులు శాంతించారు. అంతకు ముందు వైద్య, ఆరోగ్యశాఖపై చర్చను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణక్కలు మాట్లాడుతూ ఏజెన్సీలో సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్యాధికారులకు సిబ్బందికి క్వార్టర్లు కావాలని, పిహెచ్‌సిల్లో అశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోగ్య సమావేశాలు నిర్వహించుకునేందుకు హాళ్లు నిర్మించాలని, బూర్గంపాడు, కరకగూడెం, ఆళ్లపల్లికి అంబులెన్సులు కావాలని, సారపాకలో పిహెచ్‌సీ, భద్రాచలంలో పిహెచ్‌సీ, వాజేడు, పేరూరు వైద్యశాలలకు అంబులెన్సులు కావాలని కోరారు. పిహెచ్‌సీలకు మరమ్మతులు చేయించాలని వేడుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పీహెచ్‌సీల్లో వౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేసిందని వివరణ ఇచ్చారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కెసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా, డెంగ్యూ వ్యాధిగ్రస్తుల వివరాలపై ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైకార్ రుణాల విషయంలో అధికారుల, బ్యాంకర్ల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చినా బ్యాంకర్లు రుణం ఇవ్వడానికి వెనకాడుతున్నారని, నానా ఆంక్షలు పెడుతున్నారని వారు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ లక్ష్మణ్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేశ్‌కుమార్, జేసీ దివ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
హాజరైన ప్రజాప్రతినిధులు
ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి ఖమ్మం, వైరా, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పాయం వెంకటేశ్వర్లు, సండ్ర వెంకటవీరయ్యలు హాజరుకాగా కొత్తగూడెం, మధిర ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. మహబూబ్‌బాద్ ఎంపీ సీతారాంనాయక్ కూడా మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులు హాజరయ్యారు.