ఖమ్మం

విషప్రయోగంతోనే చిరుతల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 3: చండ్రుగొండ మండలంలోని అబ్బుగూడెం అటవీప్రాంతంలో రెండు చిరుతల మృతికి విషప్రయోగమే కారణమని జిల్లా కన్జర్వేటర్ డాక్టర్ జి నర్సయ్య తెలిపారు. స్థానిక డిఎఫ్‌ఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిరుతలు మృతిచెంది దాదాపు నాలుగురోజులు గడిచి ఉంటుందన్నారు. చిరుతల మృతదేహాలపై చర్మం లేచిపోవడాన్ని బట్టి ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రెండు ఆడ చిరుతలేనన్నారు. ఒకదాని వయస్సు 5 నుండి 6సంవత్సరాలు, మరొకదాని వయస్సు సంవత్సరం న్నర నుండి 2సంవత్సరాలు ఉంటుందని అన్నారు. పశువుల కాపరులు తమకు సంబంధించిన గొర్రెలు, మేకలను చిరుతలు చంపితింటున్నాయనే అక్కసుతో విషప్రయోగం చేసి వాటిని హతమార్చివుంటారని భావిస్తున్నట్లు వివరించారు. చిరుతలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా పెద్దచిరుత పంజాలను నరుక్కొని వెళ్ళారని, చిన్నచిరుతకు సంబంధించి మాత్రం వదిలేశారన్నారు. వేటగాళ్ళు అయితే చిరుతచర్మాన్ని కూడా వదిలిపెట్టరన్నారు. అందువల్లే పశువులకాపరులే హతమార్చివుంటారని తాము భావిస్తున్నామని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్, సిసిఎండిలకు కూడా పరీక్షల నిమిత్తం చిరుత అవశేషాలను పంపినట్లు చెప్పారు. పశువుల కాపర్లు తమ పశువులను ఏదైన క్రూరజంతువు హతమారుస్తున్నట్లు అనుమానం వస్తే తమ దృష్టికి తీసుకురావాలని అంతేకానీ విషప్రయోగం లాంటి పనులతో వాటిని హతమార్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అంతేకాకుండా పశువులను క్రూరమృగాల దాడిలో కోల్పోతే సంబంధిత అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. చిరుతలు అటవీప్రాంతంలో 25 నుండి 30 కిలోమీటర్ల వరకు పరిధిని ఎంచుకొని వాటిమధ్యలోనే తిరుగుతూ ఆకలి తీర్చుకోవడానికి వేటాడుతాయని అన్నారు. ముసలితనంలో లేదా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఒకేచోట ఉంటూ తమ వేటను కొనసాగిస్తాయని చెప్పారు. చిరుతలను హతమార్చిన విషయాన్ని పోలీస్‌శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్ళామని విచారణ అనంతరం దోషులపై చర్యలు ఉంటాయని కన్జర్వేటర్ వివరించారు. విలేఖరుల సమావేశంలో కొత్తగూడెం డిఎఫ్‌ఓ శాంతారాం, పాల్వంచ వైల్డ్‌లైఫ్ డిఎఫ్‌ఓ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం, రామవరం రేంజర్లు మంజుల, మధుసూధన్‌లు పాల్గొన్నారు.