ఖమ్మం

అలుగు పారుతున్న గార్ల పెద్ద చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జూలై 22: ఇటీవల కురుస్తున్న వర్షాలతో వచ్చిన వరద నీటితో శుక్రవారం గార్ల పెద్ద చెరువు నిండి అలుగు పారుతుంది. బయ్యారం పెద్ద చెరువు నిండితే తప్ప ఏలాంటి అవకాశం లేని గార్ల పెద్ద చెరువుకు వరంగల్ జిల్లా నర్సంపేట ఆటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలతో బయ్యారం పెద్ద చెరువు నిండగా ఆ చెరువుఅలుగు నుండి విడుదలైయ్యే వృధా నీరు కమలాయకట్టు,ఎర్రకాల్వ ద్వారా సర్కిల్‌సాబ్ కుంటకు చేరుకొని తద్వారా గార్ల చెరువుకు చేరుతుంది. 18అడుగు సామర్థ్యాం కలిగిన గార్ల పెద్ద చెరువుకు పూర్తి స్థాయి నీరు చెరటంతో నేడు అలుగు నుంచి నీరు విడుదవ అవుతుంది. ఈ వృథా నీరు గార్ల అప్పసముద్రం,గండి చెరువులతో పాటు మరి కొన్ని కుంటలకు చేరుతుంది. గార్ల పెద్ద చెరువు కింద అధికారికంగా 18వందల ఎరరాలుండగా అనధికారికంగా రెండు వేల రెండు వందలు ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు. చెరువు నిండి అలుగు పోస్తుండటంతో రైతులు హర్షం వెలిబుచ్చారు.