ఖమ్మం

సింగరేణిలో ఎన్నికల వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 22: సింగరేణిలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి గుర్తింపు హోదా పొందాలనే లక్ష్యంతో యూనియన్లు ప్రయత్నాలను ప్రారంభించాయి. దీనిలో భాగంగా గత వైరుధ్యాలను విస్మరించి కలిసి పోటీ చేయాలనే భావనతో వేగంగా పావులు కదుపుతున్నాయి. దీనిలో భాగంగా ఐఎన్‌టియుసి, ఎఐటియుసి కలిసి పోటీచేయాలని సన్నాహాలను ప్రారంభించాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న టిబిజికెఎస్‌ను ఓడించి తాము విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న ఈ రెండు సంఘాలు ప్రస్తుతం మిత్రులుగా కలిసి పోటీచేయాలనే నిర్ణయంపై కార్యకర్తలు ఏమేరకు స్పందిస్తారో వేచిచూడాలి. హైద్రాబాద్ స్థాయిలో జరిగిన ఐఎన్‌టియుసి అగ్రనేతల సమావేశంలో ఐఎన్‌టియుసికి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌లు కలిసి పోవాలని నిర్ణయం తీసుకున్నాయి. లేబర్ యూనియన్ బి వెంకట్రావు నేతృత్వంలో, వర్కర్స్ యూనియన్ జనక్‌ప్రసాద్ నేతృత్వంలో పనిచేస్తున్నాయి. వీరిరువురితో ఐఎన్‌టియుసి జాతీయఅధ్యక్షులు సంజీవరెడ్డి సమావేశమై యూనియన్ల విలీనంపై సుధీర్ఘంగా చర్చించి నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఇరువురు నేతలు అంగీకరించిన తరువాత ఎఐటియుసితో కలిసి పోటీచేసే అంశంపై కూడా తీవ్రంగా చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈవిషయంపై జాతీయ స్థాయిలో కూడా ఇరు యూనియన్ల నాయకులు చర్చలు జరిపినట్లు సమాచారం. ఎఐటియుసికి అనుబంధంగా ఉన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌కు గతంలో రెండు సార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన చరిత్ర ఉండగా, ఐఎన్‌టియుసి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు ఒకసారి గెలిచిన ఘనత ఉంది. గత ఎన్నికలలో సింగరేణిలోని 11 ఏరియాలలో ఐఎన్‌టియుసి కార్పోరేట్, మణుగూరు ఏరియాలలో విజయం సాధించగా, ఎఐటియుసి బెల్లంపల్లి, ఇల్లెందు ఏరియాలలో విజయం సాధించాయి. టిబిజికెఎస్ శ్రీరాంపూర్, కొత్తగూడెం, ఆర్‌జి-3, మందమర్రి, భూపాలపల్లిలో విజయం సాధించి గుర్తింపు హోదాను సాధించింది. హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆర్‌జి-1, ఆర్‌జి-2లలో గెలిచింది. ఈ యూనియన్ కూడా మిగతా ఏరియాలలో విస్తరించడానికి కృషి సాగిస్తోంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.