ఖమ్మం

బొగ్గు ఉత్పత్తి, రవాణాలో కొత్తగూడెందే ప్రథమస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టుమాస బొగ్గు ఉత్పత్తి, రవాణాలో కొత్తగూడెం ఏరియా ప్రథమస్థానంలో నిలిచింది. జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ రమణమూర్తి మాట్లాడుతూ వివరాలను తెలిపారు. ఆగస్టు మాసంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడమే కాకుండా కంపెనీలోనే ప్రథమస్థానం సాధించింది. ఆగస్టుమాసంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 5.25 లక్షల టన్నులు కాగా 6.01 టన్నులు సాధించి 114 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గనులవారీగా ఉత్పత్తి వివరాలను తెలిపారు. పివికె 5 ఇంక్లైన్ భూగర్భగని ఉత్పత్తి లక్ష్యం 0.31 లక్షల టన్నులు కాగా 0.17 సాధించి 53శాతం, వికె 7ఇంక్లైన్ భూగర్భగని 0.54 లక్షల టన్నులకు 0.39 టన్నులు సాధించి 73 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసినట్లు తెలిపారు. రెండు భూగర్భ గనుల లక్ష్యం 0.85 లక్షల టన్నులు కాగా 0.39 లక్షల టన్నులు సాధించి 73శాతం ఉత్పాదకరేటును నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జికెఓసి ఉత్పత్తిలక్ష్యం 1.84 లక్షల టన్నులుకాగా 2.27 లక్షల టన్నులు సాధించి 123శాతం ఉత్పాదకరేటును, జెవిఆర్‌ఓసి 2.26 లక్షల టన్నులకు 3.18 లక్షల టన్నులు సాధించి 124శాతం ఉత్పాదకరేటును నమోదుచేసినట్లు చెప్పారు. రెండు ఓసి గనులు కలిపి 4.40 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 5.45 లక్షల టన్నులు సాధించి 124 సరాసరి ఉత్పాదకరేటును నమోదు చేసినట్లు వివరించారు. బొగ్గు రవాణాలో కూడా 7.02 లక్షల టన్నులు రవాణాచేసి సంస్థలో ప్రథమస్థానంలో నిలిచిందని వివరించారు. విలేఖరుల సమావేశంలో డిజిఎం (పర్సనల్) శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.