కర్నూల్

రాష్ట్రాబివృద్ధి కోసమే బాబు దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, ఏప్రిల్ 20:రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టారని, ఈ పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. పట్టణంలోని పాత బస్టాండ్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు కేఈ సంఘీభావం తెలిపారు. తొలుత కేఈ దీక్షకు కూర్చున్న వారికి పూలమాలలు వేసి అభినందించారు. అనంతరం కేఈ మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారికి అండగా నిలిచే ప్రధాని మోదీ ఏపీకి మాత్రం అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్భ్రావృద్ధి కోసం గత నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి వున్నామని, అయినా రాష్ట్రానికి న్యాయం చేయకపోవడంతో సహించలేకనే తెగదెంపులు చేసుకున్నామన్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఏనాడైనా మన హక్కులు, చట్టాల గురించి కేంద్రాన్ని ప్రశ్నించారా అని నిలదీశారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి ప్రధాని మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. జగన్, పవన్ పార్టీలు కేంద్రానికి దాసోహం అయ్యాయని ఆరోపించారు. పోరాటాలు, ఉద్యమాలు టీడీపీకి కొత్త కావని, న్యాయం కోసం ఎంతటి వారినైనా ఎదురించే సత్తా చంద్రబాబుకు వుందన్నారు. టీడీపీకి బీసీలే వెనె్నముక అన్నారు. డోన్ నియోజకవర్గ ప్రజలు తనను 5 సార్లు ఎన్నుకున్నారని, వారి రుణం తీర్చుకోవడానికే ఈ ప్రాంతంలోని చెరువులకు హంద్రీనీవా నీటిని తీసుకొస్తామన్నారు. డోన్, పత్తికొండ ప్రాంతాల్లోని 68 చెరువులకు రూ. 238 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు చేపడుతామన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు అడ్రస్సే లేరని, ఓటమిని లెక్కచేయని కేఈ ప్రతాప్ మీకు అందుబాటులో వుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను పేదల దరికి చేర్చాలని, పేదల కోసం పాటుపడుతున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కేఈ కోరారు.

పడిపోయిన ఉల్లి ధర
* క్వింటాల్ రూ. 150
* రోడ్డుపై పారబోసి రైతుల నిరసన
* గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఏప్రిల్ 20:జిల్లాలోని నలుమూలల నుంచి ఉల్లి రైతులు పంట దిగుబడిని విక్రయించేందుకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. అయితే వేలంలో క్వింటాల్ ధర రూ. 150కు పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్తబస్టాండ్-పాతబస్టాండ్ రహదారిపై ఉల్లిగడ్డలు పారబోసి నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో వేళ్లే వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలిసిన వెంటనే 4వ పట్టణ సీఐ రామయ్య నాయుడు హుటాహుటిన ఉల్లి రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పులకుర్తి రైతు నాగన్న మాట్లాడుతూ తాను యార్డులో ఉల్లిగడ్డలను విక్రయించడానికి 150 బస్తాలు తీసుకొచ్చానని, ఇక్కడ చూస్తే యార్డు అధికారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై మంచి రకం ఉల్లిగడ్డలకు క్వింటాల్‌పై రూ. 150 నుంచి రూ. 200 వరకూ వేలంలో పాడుతున్నారని మండిపడ్డారు. తాము ఒక ఎకరాలో ఉల్లి పంట సాగుచేయడానికి రూ. లక్ష దాకా ఖర్చు వస్తోందని, ఇక్కడ చూస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కలేదని, ఇలా అయితే తాము పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని వాపోయాడు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డలను రూ. 20 నుంచి రూ. 30 వరకూ విక్రయిస్తుంటే యార్డులో వేలం ఇంత దారుణంగా ఉండటం ఏంటని మండిపడ్డారు. ఈ విషయాన్ని యార్డు చైర్మన్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సి.బెళగల్, గూడురు, కోడుమూరు, ఉల్చాల, తదితర ప్రాంతాలకు చెందిన ఉల్లి రైతులు పాల్గొన్నారు.