కర్నూల్

హోదా ఇచ్చేంత వరకూ పోరాటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 20:రాష్ట్రానికి ప్రత్యేక హదా ఇచ్చేంత వరకూ పోరాటం ఆపేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. నగరంలోని అంబేద్కర్ భవన్ ఎదుట శుక్రవారం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో కేఈ పాల్గొని మాట్లాడారు. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి విస్మరించారన్నారు. అలాగే లోటు బడ్జెట్‌ను పూడ్చి, రాజధాని నిర్మాణం ఢిల్లీ తరహాలో చేపట్టేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారారని మండిపడ్డారు. దీనికి తోడు జగన్ వత్తాసు పలుకుతుండడంతో ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారని వెల్లడించారు. ఇంతవరకూ తెలుగు ప్రజలు ఓర్పు, సహనంతో ఉన్నారని, తెలుగు వారితో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. బీజేపీకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. ప్రత్యేక హోదా తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి వాటికి కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై చిన్న చూపు చూస్తూ తీరని అన్యాయం చేస్తుందని, మరొక పక్క ఉత్తరాది రాష్ట్రాలు అడగకపోయినా నిధులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడుతూ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్ మోదీని వ్యతిరేకిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటాలు ఆపేది లేదని హెచ్చరించారు. హోదా సాధన కోసం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.