కర్నూల్

దూసుకపోవడమే తరువాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 19: ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఆపే శక్తి లేదని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సంతోష్ నగర్ దగ్గర ఉన్న 7 స్టార్ రీసార్ట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభకు ఎవ్వరు హాజరుకారని ప్రతిపక్ష పార్టీలు చిన్నచూపు చూస్తే అందరి అంచనాలను తారుమారు చేసి లక్ష మందికి పైగా పాల్గొని చాల పెద్ద ఎత్తున విజయవంతం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీపై నెపం వేసిన వారందరికి రైతులు, నిరుద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అన్ని పార్టీల నాయకులకు కనువిప్పు కలిగే విధంగా చేశారన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో విద్యార్థులు, యువజనులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం దేశంలోనే మొదటి దవుతుందన్నారు. అందరూ ఒక ప్రభంజనం లాగా వచ్చి సత్యమేవ జయతే బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రూ.6కోట్ల ను ఖర్చు చేసి, జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్సులను వాడుకున్న రాహుల్ గాంధీ సభకు వచ్చినట్లుగా జనాలు రాలేదన్నారు. ఆయన ప్రసంగం ఎంతో ఆకట్టుకుందని, ప్రసంగాన్ని వినటానికి సునామి లాగా దూసుకొచ్చారన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన మోసం, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయాన్ని గమనించారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడిందని, ఈ పార్టీని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యమని, రైతులకు రుణమాఫీతో పాటు అన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తుందని ప్రజలు భావించి పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారన్నారు. అందుకు బహిరంగ సభనే నిదర్శనమని, దూసుకెళ్లడమే తరువాయిని, ఎన్ని అబద్దాలు చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాహుల్ గాంధీ సభతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు.

మురుగు నీటిపాలైన వేరుశెనగ పంట
* మార్కెట్‌యార్డులో చేరిన వర్షం నీరు
ఆదోని, సెప్టెంబర్ 19: రైతు ఆరుగాలం శ్రమించి పండించిన వేరుశెనగ పంటను అమ్ముకుందామని ఆదోని మార్కెట్‌యార్డుకు తీసుకు వస్తే తేలిక పాటి వర్షానికే వర్షం నీరు ప్లాట్ ఫాం మీదకు చేరి వేరుశెనగ తడిసిపోవడం, మరికొంత వేరుశెనగ పంట మురుగు కాలువ పాలు అయింది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. రాయలసీమలోని ఆదోని మార్కెట్‌యార్డు అతి పెద్దది వేరుశెనగ, పత్తి పంటల దిగుబడి అమ్ముకోవడానికి రైతులు తీసుకొచ్చి టెండర్ అయ్యేంత వరకు ఫ్లాట్ ఫాంపై వేస్తుంటారు. అయితే ఫ్లాట్‌ఫాం పైకప్పు నిర్మించలేదు. అందువల్ల వర్షం వచ్చినప్పుడల్ల రైతు తెచ్చిన వేరుశెనగ పంట తడిసిపోవడం జరుగుతుంది. దీంతో పంటల తడిసిపోయిందని వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. బుధవారం సాయంత్రం తేలికపాటి వర్షం పడింది. ఆ వర్షానికి వేరుశెనగ వ్యాపారం కోసం ఉంచిన ప్లాట్‌ఫాంలో నీరు చేరింది. అక్కడికి రైతులు తడిసి పోకుండా ప్లాస్టిక్ టార్పాళ్లు వేశారు. అయినా నీరంతా నిండిపోవడంతో చాలా వరకు రైతు అమ్మకానికి తెచ్చిన వేరుశెనగ వర్షం నీటిలో కొట్టుకుపోయి మురికి కాలువల్లో కలిసింది. దీంతో వేరుశెనగ రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రతి సంవత్సరం మార్కెట్‌యార్డుకు రూ.14కోట్లు ఆదాయం వస్తుంది. అయినప్పటికి రైతు తెచ్చిన సరుకును నిలువ ఉంచడానికి పైకప్పులు నిర్మించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతున్నా మార్కెట్‌యార్డు అధికారులు పట్టించుకోక పోవడంపై రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని మార్కెట్‌యార్డు అధికారులు వేరుశెనగ మార్కెట్‌యార్డులో కూడా పూర్తి స్థాయిలో పైకప్పు ఉండే విధంగా షెడ్లు నిర్మించి రైతులకు నష్టం లేకుండా చూడాలని కోరుతున్నారు.

జననేత జగన్
* ఎమ్మెల్యే ఐజయ్య
ఆత్మకూరు, సెప్టెంబర్ 19: ప్రజల్లో ఉంటూ, 2970 కిలో మీటర్లు తిరుగుతూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్న వైకాపా అధ్యక్షులు జగన్ జననేతగా అయ్యాడని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. బుధవారం సుప్రసిద్ధమైన కొలను భారతి క్షేత్రాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. రావాలి జగన్ - కావాలి జగన్ అనే కార్యక్రమం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర వల్ల జగన్‌కు విశేష స్పందన లభించిందన్నారు. చంద్రబాబు సీఎం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని వారు గమనిస్తున్నారన్నారు. రైతులను, పొదుపు మహిళలను దగా చేయడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేరు మార్చి మేమే అమలు చేస్తున్నామని చెప్పడం అన్యాయమన్నారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెడితే సీఎం చంద్రబాబు ఆయన కాలంలో ఒక్కరికి కుడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రజల సహకారం, ఆశీర్వాదంతో జగన్ ముఖ్యమంత్రి అయితే మద్యపాన నిషేదం చేస్తారన్నారు.