కర్నూల్

సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 20:సీఎం చంద్రబాబు ఈ నెల 22వ తేదీ జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం పర్యటించే అవుకు మండల పరిధిలోని రిజర్వాయర్, గాలేరు-నగరి సుజల స్రవంతి, తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండి తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డికి అప్పజెప్పారు. బందోబస్తు విధుల్లో ఒకరు అడిషనల్ ఎస్పీ, 10మంది డీఎస్పీలు, 30మంది సీఐలు, 64మంది ఎస్‌ఐలు, 146మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 350 మంది కానిస్టేబుళ్లు, 28 మంది మహిళా పోలీసులు, 220 మంది హోంగార్డులు, 12 స్పెషల్ పార్టీ బృందాలు, 8 ప్లాటూన్ల ఏఆర్ సిబ్బందిని కేటాయించామన్నారు. హెలిప్యాడ్, జలహారతి ప్రదేశం, పార్కింగ్ స్థలాలు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వారి వెంట అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీలు బాబుప్రసాద్, ఖాదర్‌బాషా, గోపాలకృష్ణ, సీఐ శ్రీనివాసురెడ్డి, ఆర్‌ఐ జార్జి పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరపుకొందాం
* ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 20:మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కర్నూలు నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని సమన్వయం పాటించి ఐక్యతతో ప్రశాంతంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ యుగంధర్‌బాబు, ట్రాఫిక్ డీఎస్పీ గంగయ్య, గణేశ్ కేంద్ర ఉత్సవ సమితి నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు కలిసి వినాయక్ ఘాట్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్వీ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారని ఆరా తీశారు. నిమజ్జనానికి కావాల్సిన క్రేన్లు, లైట్లు, మైకులు, పారిశుద్ధ్య పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించామని కమిషనర్ హరినాథరెడ్డి వివరించారు. నిమజ్జనం కోసం చిన్న, చిన్న విగ్రహాలను అయ్యప్పస్వామి ఆలయం వైపు ఉన్న ఘాట్‌లో, వినాయక్ ఘాట్‌కు ఎదురుగా ఉన్న పార్క్ వైపు పంపనున్నామన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడుతూ గత ఏడాది కూడా బక్రీద్, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు వచ్చాయని, అయినా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ దేశంలోనే కర్నూలు నగరం మతసామరస్యానికి ప్రతీకగా నిలిపారన్నారు. అలాగే వినాయక్ ఘాట్‌కు ఎదురుగా ఉన్న ఆలయంపై పోలీసుల నిఘా కోసం సీసీ కెమెరాలు, కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది ముందుగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలంటూ వినాయక చవితి పండుగకు ముందే నగర పాలక సంస్థ, పొల్యూషన్ కంట్రోల్ రూమ్ వద్ద 15 అడుగుల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశామని, అందువల్ల ఈసారి దాదాపు నగరంలో సగానికి పైగా మట్టి విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేశారన్నారు.