కర్నూల్

నదుల అనుసంధానంతో సీమను సస్యశ్యామలం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 22: నదుల అనుసంధానం చేసి రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించి సీమను సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావలి నదుల అనుసంధానం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని, ఈ నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బంది ఉండదని, ముఖ్యంగా రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా కృషి చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గమైన కుప్పం కంటే ముందుగానే కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాలకు ముందుగా నీరు ఇచ్చే విధంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, కాల్వల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. గోరుకల్లు అవుకు టనె్నల్, పులికనుమ ఈ మూడు ప్రాజెక్టులు ఒకే రోజు ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పట్టిసీమ వలన కృష్ణా డెల్టా సస్యశ్యామలంగా ఉండడంతోపాటు పోతిరెడ్డిపాడు జలాశయం ద్వారా రాయలసీమ ప్రాంతమైన గండికోట, పులివేందుల, అనంతపురం ప్రాంతాలకు నిర్వహిస్తున్నామన్నారు. 612 కోట్లతో గంటికోట ప్రాజెక్టును పూర్తి చేశామని, 512 కోట్లతో గోరుకల్లు ప్రాజెక్టును అభివృద్ధి పరచామని, ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2లో బ్రహ్మసాగర్‌కు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం 56 వేల కోట్లతో 57 ప్రాజెక్టులు పూర్తిచేయదలచామని, ఇప్పటికే 17 ప్రాజెక్టులు పూర్తయి ప్రారంభోత్సవం చేశామని, 27 ప్రాజెక్టులు ఆవిర్భావం జరుగుతుందని, మరో 12 ప్రాజెక్టులను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరంగా డ్వాక్రా సంఘాలకు రూ.10 వేల కోట్లు, రుణమాఫికి రూ.28 వేల కోట్లు, 50 లక్షల పెన్షన్లు, 25 లక్షల ఇళ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరవు నివారణ కోసం అనేక ప్రణాళికలు రూపొందించామని, రైన్‌గన్‌లు ఉపయోగిస్తున్నామని, పది లక్షల నీటి కుంటలు తవ్వామని, అన్ని చెరువులకు సాగునీరు అందించే విధంగా అనుసంధానం చేస్తున్నామని, వరుసగా చెక్‌డ్యాంలు నిర్మించడం జరుగుతుందని, ఇవన్ని సకాలంలో పూర్తయి రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అయ్యే విధంగా నిరంతర శ్రమతో పనిచేస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా పరిపాలన విధంగా అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనుల్లో ముందుకు పోతున్నామని సీఎం అన్నారు.

అవుకు జలాశయం నుంచి గండికోటకు నీరు విడుదల
* జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో సీఎం చంద్రబాబు జలహారతి
అవుకు, సెప్టెంబర్ 22 : అవుకు రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటర్ గేట్ల నుంచి గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోటకు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సీఎం చంద్రబాబు తొలుత మండల పరిధిలోని రామాపురం హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని స్విచ్ ఆన్ చేసి జీఎన్‌ఎస్‌ఎస్ గేట్లను ప్రారంభించి రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేశారు. అలాగే నంద్యాల డివిజన్‌లోని పాణ్యం మండలం గోరుకల్లు జలాశయంలో తొలిసారిగా 10 టీఎంసీల నీటి నిల్వను, మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం శాతనూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నుంచి పులికనుమ ఎత్తిపోతల పథకాలను సీఎం చంద్రబాబు అవుకు నుంచే ప్రారంభించారు. అనంతరం ఆత్మకూరు మండలంలోని ఇస్కాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అవుకు జలాశయం వద్ద రూ. 1.7 కోట్లతో నిర్మించిన పర్యాటక శాఖ రెస్టారెంట్, వీఐపీ అతిథి గృహాలను ప్రారంభించారు. వనం-మనం కార్యక్రామంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో సీఎం చంద్రబాబు సర్వమత ప్రార్థనల మధ్య జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు.