కర్నూల్

మహానంది క్షేత్రంలో కార్తీకమాస పూజలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, నవంబర్ 8: నదీ, తీర్థం, కలగలసి శివకేశవుల నిలయంగా వెలసిన మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. గురువారం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ కార్తీక ద్వీపోత్సవ కార్యక్రమాన్ని వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లు, ఆలయ చైర్మన్ పాణ్యం ప్రసాద్‌రావు ఆలయ ఈఓ సుబ్రమణ్యం దంపతులచే అత్యంత వైభవంగా వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం ఈ కార్తీక మాస ఉత్సవ విశిష్టతను గురించి వివరిస్తూ కృత్తిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు వచ్చినట్లు తెలిపారు. కార్తీక మాసంలో సూర్యుడు తుల సంక్రమణం ప్రవేశించగానే గంగానదితో సరిసమానంగా సమస్త జలాలను విష్ణుమదం కావడంతో కార్తీక మాసం చేసిన వారు పుణ్య ప్రదులు అవుతారని తెలిపారు. ఈ మాసంలో నదీస్నానం, జపాదులు ఆచరించేవారికి అక్షయమైన అశ్వమేథ ఫలాన్ని పొందుతారన్నారు. చంద్రుని వారమైన సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి దినం అత్యంత పుణ్యప్రదమైనదని, ప్రతి రోజు తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి కార్తీక ద్వీపాన్ని వెలిగించి పమరేశ్వరునికి అభిషేకించిన వారికి సకల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారన్నారు. ఈ మాసంలో వస్తద్రానం, హిరణ్యదానం, కన్యాదానం, గోదానం చేసిన వారికి విశేష ఫలితాలు పొందడంతోపాటు తేజస్సు, యశస్సు, కార్యసిద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. కార్తీక శుద్ధపౌర్ణమి నాడు కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించిన జ్వాలా తోరణం దర్శనం చేసుకున్నా, దీపోత్సవ దర్శనం చేసుకున్న సమస్త సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. ఇంతటి ప్రసిద్ధిగాంచిన కార్తీక మాసంలో నదీ క్షేత్రం కలగలసిన మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శించుకోవడంతో సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నారు.
మహానందిలో భక్తుల రద్దీ: మహానందిలో కార్తీక మాసం మొదటి రోజున వేలాది మంది భక్తులు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. తెల్లవారుజామునుండే భక్తులు తరలివచ్చి ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకొని కార్తీక ద్వీపాలను వెలిగిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయంలోని ధ్వజస్థంభం, నాగులకట్ట వద్ద కార్తీక ద్వీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహించారు.

ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలి
* ఎమ్మెల్యే సాయి
ఆదోని, నవంబర్ 8: రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. మండలంలోని పాడేగల్ గ్రామంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యయత్నం పట్ల చంద్రబాబునాయుడు హేళనగా మాట్లాడడం దారుణమన్నారు. ఈ హత్యాయత్నం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బుద్ది చెబుతారని ఆయన అన్నారు. వైకాపా దాటికి టీడీపీ తట్టుకోలేదన్నారు. అంతకు ముందు బల్లేకల్ గ్రామం వద్ద రూ.50లక్షలతో నిర్మించే బీటి రోడ్డుకు ఎమ్మెల్యే పూజలు చేశారు.