కర్నూల్

ప్రశాంతత నెలకొల్పా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, నవంబర్ 19:్ఫ్యక్షన్ నియోజకవర్గంగా వున్న నందికొట్కూరులో ప్రశాంత వాతావరణం నెలకొల్పానని, ఎన్నడూ నీచ రాజకీయాలకు పాల్పడలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం పని చేస్తున్నానన్నారు. మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరులో సోమవారం ఆయన తన స్వగృహంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నామన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వున్న తమను ఇటీవల పార్టీలో చేరిన వారు విమర్శించడం భావ్యం కాదని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గతంలో అనంతపురం జిల్లా నేతలు కేసీ కాలువ నీటిని తరలించేందుకు యత్నిస్తే ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ను కలిసి నియోజకవర్గ రైతాంగం నష్టపోతుందని తెలుపడంతో వెంటనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారన్నారు. అలగనూరు రిజర్వాయర్ నిర్మాణంలో తాను అవినీతికి పాల్పడినట్లు ఆరోపించడం తగదన్నారు. పాణ్యం టికెట్ తమకే వస్తుందని, టికెట్ విషయంలో అధినేత జగన్‌తో కొట్లాడి అయినా సాధించుకునే చనువు తనకు అధిష్ఠానం వద్ద వుందన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తనకు పుట్టినిల్లు అయినా మెట్టినిల్లు అయినా నందికొట్కూరు నియోజకవర్గమే అన్నారు. నియోజకవర్గంలో పలు ఎత్తిపోతల పథకాలు దివంగత నేత వైఎస్ పుణ్యమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితే వైఎస్ పాలన కంటే మెరుగైన పాలన అందిస్తారన్నారు. ముఖ్యంగా గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేసి కేసీ ఆయకట్టుకు రెండు పంటలకు నీరందిస్తారన్నారు. కాగా ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని ప్రకటించిన ఎమ్మెల్యే ఐజయ్య, నంద్యాల పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం.