కర్నూల్

రైతులు రబీలో పంట బీమా చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 19: రబీలో పంటలు వేసుకొనే రైతులు తమ పంటలకు భీమాను చేసుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే, ఆర్డీవో రామసుందర్‌రెడ్డిలు కౌలు రైతులకు రుణాలపై రెవెన్యూ వ్యవసాయ శాఖ కో- ఆపరేటీవ్ బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల, గోస్పాడు మండలంలోని కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వలేదని అందుకై సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు మండలాల్లోని వ్యవసాయాధికారులు కౌలు రైతులను గుర్తించి రుణాలు ఇప్పించడంలో సహాయకారులుగా ఉండాలన్నారు. కో- ఆపరేటీవ్ బ్యాంకు వారు నియోజకవర్గంలోని దాదాపు 500 మంది కౌలు రైతులకు రైతుకు రూ.10 వేల ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. ఉన్నతాధికారులకు వివరించి వారికి ఉన్న బ్రాంచీల ద్వారా సకాలంలో రుణాలు ఇప్పించాలని, అలా చెల్లించడం వల్ల బ్యాంకు వారు విరివిగా రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఆర్డీవో రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, అలా చెల్లిస్తే బ్యాంకు వారు తిరిగి విరివిగా రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తారన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నంద్యాల ఆర్డీవో రామసుందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ 1954లో బ్రిటీష్ కాలంలో చుక్కల భూములను అమ్ముకోవడానికి వీలు లేకుండ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో చుక్కల భూముల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటే అలాంటి వారు ఏవరైనా ఉంటే వారికి ఆభూములను సర్వే చేయించి సర్వే నెంబరు కేటాయించి వారికి ఇంటి పట్టాలు కేటాయించడం జరుగుతుందన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో భూములు కొలతలు వేయించాలని, భూములను ఆన్‌లైన్ చేయించాలని, పెన్షన్లు ఇప్పించాలని మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో