కర్నూల్

జిల్లా ప్రజలకు శుభం కలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 8: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పురస్కరించుకుని సమృద్ధిగా వర్షాలు కురిసేలా జిల్లా ప్రజలు వరుణదేవుడిని ప్రార్థించాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శుక్రవారం దుర్ముఖినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుర్మిఖినామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు పాడిపంటలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. జిల్లా ప్రజలందరూ హృదయ పూర్వకంగా వరుణదేవుడిని ప్రార్థించి వాగులు, వంకలు పొంగేలా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని సంకల్పించాలన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు రైతులకు మంచి పంట దిగుబడులు రావాలని, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు శుభాలు కలగాలని కోరారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఇప్పడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో మరింత అభివృద్ధి చెందేలా దేవుడిని ప్రార్థించాలని ప్రజలకు విజప్తి చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన, ప్రభుత్వ సంగీత కళాశాల అధ్యాపకుల బృందం నాదస్వరం, విద్యార్థుల గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొలనుభారతి ఆలయ నంద్యాల పంచాంగ గ్రంధకర్త శిశభూషణ సిద్దాంతిచే ఈ సంవత్సరం రాశుల ఫలితాలు, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం గుర్తించిన వివిధ రంగాల్లో ఉగాది పురస్కార అవార్డు గ్రహీతలకు, కవి సమ్మేళంలో పాల్గొన్న కవులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఎస్వీ కలిసి రూ. 10వేల నగదు పారితోషికంతో పాటు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, జెసి-2 రామస్వామి, అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు, ఉగాది ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోపనవరం రామచంద్రన్ పాల్గొన్నారు.