కర్నూల్

వైకాపాకు వేమిరెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 25: ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నెల్లూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లా సమన్వయ కమిటీలతో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయనతో ఉన్న సత్సంబంధాల కారణంతో జగన్‌కు సహకరించాలని నిర్ణయించి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అయితే పార్టీ వ్యవహరశైలి తనకు నచ్చకపోవడంతో పాటు చంద్రబాబు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై తాను టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను చేస్తున్న సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఏదైనా రాజకీయ పార్టీ అండదండలు ఎంతో అవసరమని భావించి, అందుకు టిడిపినే సరైన వేదికగా భావిస్తూ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈనెల 27న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్న తరుణంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నాననీ, అయితే ముఖ్యమంత్రి పర్యటన కొన్ని కారణాల వల్ల వాయిదా పడడంతో తన చేరిక కూడా వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. త్వరలో జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో చేరుతానని వేమిరెడ్డి స్పష్టం చేశారు. వ్యాపారాల కోసం తాను అధికార పార్టీలో చేరడం లేదన్నారు. రాజ్యసభ సీటు కోసం తాను టిడిపిలో చేరుతున్నట్లు వచ్చే వార్తలలో ఎంతమాత్రం నిజం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలియచేశారు. నారా లోకేష్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, మంచి నాయకుడిగా ఎదుగుతాడని జోస్యం పలికారు. సామాజిక కార్యక్రమాలు కొనసాగుతాయని, వాటికి రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

బుచ్చి సర్పంచ్‌కు ప్రశంసాపత్రం
బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 25: బుచ్చిరెడ్డిపాళెం సర్పంచ్ జూగుంట స్నేహలత జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రాన్ని పొందారు. న్యూఢిల్లీలో రెండు రోజుల నుండి జరుగుతున్న పొలిటికల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌కు జిల్లా నుండి ఆమెకు ఆహ్వానం అందింది. ఈ సెలబ్రేషన్స్‌కు మన రాష్ట్రం నుండి రాజకీయ రంగంలో 10 మంది మహిళా నేతలు ఎంపిక కాగా జిల్లా నుండి ఆ గౌరవం బుచ్చి సర్పంచ్‌కు దక్కడం హర్షించదగ్గ విషయం. పంచాయితీ అభివృద్ధిలో మహిళల పాత్ర అనే అంశంపై మన రాష్ట్రం నుండి మాట్లాడే అరుదైన అవకాశాన్ని స్నేహలత దక్కించుకున్నట్లు పంచాయితీ అధికారుల ద్వారా తెలిసింది. ఈ అంశంపై ప్రసంగించినందుకు ఆమెకు జాతీయస్థాయి ప్రశంసాపత్రం లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు మహిళలు, రాజకీయ నేతలు, పంచాయితీ బోర్డు సభ్యులు అభినందనలు తెలిపారు.

పాలీసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
10 కేంద్రాలలో పరీక్ష నిర్వహణ
హాజరుకానున్న 3,837 మంది విద్యార్థులు
27న పరీక్ష
వేదాయపాళెం, ఏప్రిల్ 25: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే పాలీసెట్ పరీక్షకు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద వౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రధానంగా ఎండలు తీవ్రంగా కాస్తున్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 27వ తేది ఉదయం జరిగే పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 3,837 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 27న ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 11 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదన్నారు. మొత్తం 10 పరీక్షా కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నట్లు పాలీసెట్ సమన్వయకర్త టి.నారాయణ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద వౌలికసదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక పరిశీలన అధికారిని నియమించినట్లు వెల్లడించారు. పోలీసులు, విద్యాశాఖ, రెవెన్యూశాఖల నుంచి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మొత్తంమీద పాలీసెట్ పరీక్షకు అన్ని ఏర్పాటు అధికారులు పూర్తిచేసినట్లు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు.