ఆంధ్రప్రదేశ్‌

కోడెల మృతికి పలువురు ప్రముఖులు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన ఆకస్మిక మృతిని అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారు. బసవతారకం ఆసుప త్రికి పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. డాక్టర్ కోడెల మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు రాఘవేందర్‌ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రెవంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, తెలంగాణ మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.