తెలంగాణ

కోడి రామకృష్ణ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారంనాడు కన్నుమూశారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఈ రోజు కన్నుమూశారు. 30 సంవత్సరాలకు పైగా చిత్రపరిశ్రమకు సేవలందించిన ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. దాదాపు 525 రోజులు ఈ సినిమా ఆడింది. చిరంజీవి కథానాయకుడు. 2016లో కన్నడ చిత్రం నాగహారవుతో తరువాత ఆయన దర్శకత్వం చేపట్టలేదు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. 2012లో రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది. అలాగే పది నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు. దర్శకత్వంతో పాటు కోడి రామకృష్ణ పలు చిత్రాల్లో నటించారు.