క్రీడాభూమి

కోహ్లీ అసహనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మూడో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనానికి గురయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతి కోహ్లీ బ్యాట్‌ను తగులుతూ వికెట్‌కీపర్ విలాస్ చేతిలోకి వెళ్లింది. అవుటయ్యాడని తాహిర్ అప్పీల్ చేయడం పట్ల కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. తాహిర్ బంతి వేసినప్పుడు క్రీజ్ వెలుపల కాలుపెట్టడంతో దానిని నోబాల్‌గా ప్రకటించాలన్నది కోహ్లీ అభిప్రాయం. పదిపదిహేను సెకన్లు గడిచిన తర్వాత తాహిర్ వేసిన బంతిని నోబాల్‌గా అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫొర్డ్ ప్రకటించాడు. రీప్లేలో తాహిర్ క్రీజ్ వెలుపలకు కాలుపెట్టినట్టు స్పష్టంగా కనిపించింది. కాగా, కొన్ని క్షణాలైనాసరే అసహనం వ్యక్తం చేసినందుకు కోహ్లీపై మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ ఆతర్వాత ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ధాటిగా బ్యాటింగ్‌ను కొనసాగించి, ఆట ముగిసే సమయానికి అజేయంగా 83 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతను అర్ధ శతకాన్ని పూర్తి చేయడం ఇదే మొదటిసారి. సహజంగా హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే గంతులు వేయడం, బ్యాట్‌ను స్టేడియంలో నలువైపలా చూపిస్తూ సంబరపడడం కోహ్లీకి అలవాటు. కానీ, ఈ సిరీస్‌లో మొదటిసారి హాఫ్ సెంచరీ చేసిన అతను పాఠశాల విద్యార్థులు కూర్చున్న స్టాండ్స్‌వైపు బ్యాట్‌ను ఓ క్షణం చూపించడంతో సరిపుచ్చాడు. కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీకి కేవలం 17 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ, మరో 11 పరుగులు చేస్తే 3,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
రహానేతో కలిసి కోహ్లీ ఐదో వికెట్‌కు అజేయంగా 133 పరుగులు జోడించారు. ఈ సిరీస్ మొత్తంలో ఏ వికెట్‌కైనా వంద పరుగులకు మించి భాగస్వామ్యం నమోదుకావడం ఇదే మొదటిసారి. సిరీస్‌లో 115వ భాగస్వామ్యంలో ఇది సాధ్యపడిందంటే, బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం ఎంతగా కష్టపడుతున్నారన్న విషయం స్పష్టమవుతుంది.
(చిత్రం) అంపైర్‌వైపు అసహనంగా చూస్తున్న విరాట్ కోహ్లీ