క్రీడాభూమి

‘చెన్నై’కి అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దక్షిణాఫ్రికాపై సాధించిన అపూర్వ విజయాన్ని చెన్నై బాధితులకు అంకితం ఇస్తున్నట్టు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆజింక్య రహానే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించారు. టెస్టు సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న వారు చెన్నై బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. సోమవారం ముగిసిన చివరిదైన నాలుగో టెస్టులో విజయాన్ని ఒక చిరస్మరణీయ సంఘటనగా కోహ్లీ అభివర్ణించాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించడం అనుకున్నంత సులభం కాదని అన్నాడు. తాము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని చెప్పాడు. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలను నమోదు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని రహానే అన్నాడు. వ్యక్తిగత రికార్డు కంటే, జట్టుకు తన బ్యాటింగ్ ఉపయోగపడిందన్న సంతోషం ఎక్కువగా ఉందన్నాడు. ఈ సిరీస్‌లో 31 వికెట్లు కూల్చిన అశ్విన్ మాట్లాడుతూ ఇది అపురూపమైన విజయమని కొనియాడాడు. సాధ్యమైనంత త్వరగా చెన్నైకి వెళ్లి, అక్కడ వరద బాధితులకు సహాయసహకారాలు అందిస్తానని చెప్పాడు. (చిత్రం) నెల్సన్ మండేలా-మహాత్మా గాంధీ సిరీస్ ట్రోఫీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ