మీకు తెలుసా ?

కొంగల ప్రత్యేకతే వేరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంగజపం అని వెటకారం చేస్తారుగానీ..వాటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. పక్షిజాతిలో ఇవి ఎగరగలిగినంత ఎత్తుకు మరే పక్షీ ఎగరలేదు. అవసరమైతే ఆకాశంలో ఇవి 32,800 అడుగుల ఎత్తునకూడా ధీమాగా ఎగరగలవు. వలసవెళ్లే సమయంలో కనీసం 10వేల మైళ్లదూరాన్ని అధిగమిస్తాయి. అవసరమైతే రోజుకు 500 మైళ్ల దూరం ఎగురుతాయి. ఒకసారి జతగడితే ఆ పక్షులూ రెండూ జీవితాంతం కలిసే ఉంటా యి. పిల్లల్ని కలసి సాకుతాయి. అన్నట్లు కొంగల పిల్లలు నించునే నిద్రపోతాయి తెలుసా.

కుందేలులా గెంతే ఎలుక
ఈ ఏనుగు తొండం ఎలుకలు ఆఫ్రికాలో మాత్రమే కన్పిస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే...అవి మిగతా ఎలుకల్లా నడవవు. కుందేళ్లలా గెంతుతూ సంచరిస్తాయి. ఏనుగుతొండంలా వీటి ముక్కు ఉండటంవల్ల వాటికి ఆ పేరు వచ్చిందంతే. క్రిమికీటకాలే వీటి ఆహారం. శత్రువులనుంచి రక్షణకు వీలుగా కొన్ని ప్రత్యేక దారులను ఇవి ఏర్పాటు చేసుకుంటాయి. అనుమానం వస్తే చటుక్కున పారిపోతూంటాయి.

నీళ్లలో తేలే యాపిల్
యాపిల్ పళ్లు నీళ్లలో మునిగిపోవు తెలుసా. ఈ పళ్లలో 25 శాతం గాలి నిండి ఉంటుంది. అందువల్ల అవి నీళ్లలో తేలుతూంటాయి. ఇక ఉప్పు, కొవ్వు, కొలెస్టరాల్ ఈ పళ్లలో అసలు ఉండవు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఈ పళ్లను తింటే డాక్టర్ అవసరమే రాదని చెబుతారు. ప్రపంచంలో యాపిల్స్‌ను ఎక్కువగా పండించే దేశం చైనా. చైనీస్ వీటిని ‘పింగ్’ అని పిలుస్తారు. పింగ్ అంటే శాంతి అని అర్థమట. అన్నట్లు ఈ యాపిల్ పళ్లు గులాబీ జాతికి చెందినవంటే నమ్ముతారా!

గొరిల్లాకు సిగ్గు ఎక్కువ
ఔను..గొరిల్లాలు బాగా సిగ్గుపడతాయి. అంత తొందరగా బయటకు రావడానికి ఇష్టపడవు. పొదలమాటున, చెట్లమాటున నక్కి ఉండటానికే ఇష్టపడతాయి. గుంపులుగా జీవించే వీటిలో సిల్వర్‌బాక్ గొరిల్లా ఆ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తుంది. కొన్ని ఆడ గొరిల్లాల సమూహంతో ఇవి జీవిస్తాయి. దేనితో జత కలవాలన్నది నాయకత్వం వహించే గొరిల్లా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇక యువ గొరిల్లాలను బ్లాక్‌బాక్ గొరిల్లాలని అంటారు. ఏరోజుకు ఆరోజు గొరిల్లాలు తమ ఇళ్లను సిద్ధం చేసుకుంటాయి. రాత్రిపూట విశ్రాంతి, పగటిపూట ఆహారానే్వషణ వీటి అలవాటు. వీటి ఆహారంలో దాదాపు 75శాతం పండ్లే. పరికరాలను వాడటం, బాడీలాంగ్వేజ్ ద్వారా సమాచార మార్పిడి వీటి ప్రత్యేకత.

-ఎస్.కె.కె.రవళి