కొత్త నటీనటులతో ప్రేమెంత పనిచేసే నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరికృష్ణ, అక్షిత జంటగా జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించారు. తొలి సన్నివేశంపై హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ- తానిప్పటివరకూ అనేకమంది సీనియర్ హీరోలతో కలిసి చిత్రాలను రూపొందించానని, తొలిసారిగా నూతన నటీనటులతోపాటుగా సాంకేతిక నిపుణులను కూడా కొత్తవారిని తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని తెలిపారు. అరకులో ఓ కుర్రాడికి జరిగిన యధార్థ కథనాన్ని ఆధారం చేసుకొని ఈ కథ సిద్ధం చేశానని, కానె్సప్టెడ్ సబ్జెక్టుతో అండర్ కరెంట్‌గా లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా సాగుతోందని తెలిపారు. ఈనెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను అరకు, హైదరాబాద్‌లల సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేసి మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. వైవిధ్యమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని హరికృష్ణ అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు యాజమాన్య, కథానాయిక అక్షిత చిత్ర విశేషాలను తెలిపారు. రాజావనె్నంరెడ్డి, శ్రీరామ్‌బాలాజి, దుర్గారావు, రాజేంద్రకుమార్, చరణ్, గిరి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు:లక్ష్మీ వి.శివ, కెమెరా:కృష్ణ జక్కుల, నిర్మాత, దర్శకత్వం:జొన్నలగడ్డ శ్రీనివాసరావు.