రాష్ట్రీయం

కొత్తగూడెంలోనే కొత్త విమానాశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగిలిన ప్రాంతాల్లో అవకాశాలు తక్కువే * ప్రాథమిక అంచనాలో నిపుణుల వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో హైదరాబాద్ తరువాత కొత్తగూడెంలో మాత్రమే మరో కొత్త విమానాశ్రయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పట్లో మరో జిల్లాలో విమానాశ్రయం అంత లాభసాటి కాదని, వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. నిబంధనలతోపాటు లాభదాయకత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కొత్తగూడెం మినహా మిగిలిన ప్రాంతాల్లో విమానాశ్రయానికి అవకాశాల తక్కువని అధికార వర్గాలు తెలిపాయి. కొత్తగూడెం హైదరాబాద్‌కు 170 కిలో మీటర్ల దూరంలో ఉండటం, సింగరేణి సంస్థ, భద్రాచలం దేవాలయం ఉండటం వంటివి కొత్త విమానాశ్రయానికి అనుకూల అంశాలని అధికారవర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో విమానాశ్రయాలు ఉన్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌లో మినహా మరెక్కడా విమానాశ్రయం లేదు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ మధ్యలో ఉండడం, రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి ఏ జిల్లాకైనా వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఇతర జిల్లాల్లో విమానాశ్రయాలు విజయవంతం కావడానికి అవకాశం తక్కువ.
హైదరాబాద్ నుంచి కారులో ఒక జిల్లాకు వెళ్లాలంటే రెండు గంటల్లో వెళ్లవచ్చు. అదే విమానంలో అయితే గంట ముందు విమానాశ్రయానికి వెళ్లాలి. విమానాశ్రయం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి మరింత సమయం పడుతుంది.
ఇలాంటి కారణాలవల్ల తెలంగాణలో విమానాశ్రయాలు లాభసాటిగా నడిచే అవకాశాలు లేవని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో నిర్మించే విమానాశ్రయం రక్షణ శాఖ అవసరాలకు సైతం వినియోగించుకునే విధంగా ఉండాలనే ప్రతిపాదన ఉంది. నిజామాబాద్, వరంగల్‌లో గతంలోనే విమానాశ్రయాలు ఉన్నాయి.
వరంగల్ సమీపంలో మామునూరు విమానాశ్రయాన్ని దాదాపు రెండు దశాబ్దాల క్రితమే నిర్మించారు. 15 ఏళ్ల క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్‌కు ఎయిర్ బస్‌ను ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో రెండు నెలల్లోనే మూసేశారు. ఇటీవల సమ్మక్క సారక్క జాతర సమయంలో వారం రోజుల పాటు ప్రత్యేకంగా ఎయిర్ బస్‌లు నడిపారు. ఒక్క ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా సూచించింది. దీంతో పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు.