మూడు రోజుల్లో 10 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

========= కోన వెంకట్ ==========
దర్శకుడు ఉదయ్ నందనవనం 12 ఏళ్ళుగా కష్టపడి రూపొందించిన ‘శంకరాభరణం’ విడుదలైన మూడు రోజుల్లోనే 10కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని రచయిత కోన వెంకట్ తెలిపారు. నిఖిల్, నందిత జంటగా ఉదయ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందించిన శంకరాభరణం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ, సప్తగిరి-పృధ్వీ పండించిన కామెడీ చిత్రానికి హైలెట్‌గా నిలిచిందని, నిఖిల్ డైలాగ్స్ చెప్పిన విధానం, అతని బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా వుందని అందరూ చెబుతున్నారని అన్నారు. ఇంత పెద్దగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. దర్శకునిగా తొలి చిత్రంతోనే ఓ మంచి చిత్రం రూపొందించానని అందరూ చెబుతుంటే ఆనందంగా వుందని దర్శకుడు ఉదయ నందనవనమ్ అన్నారు. తానిప్పటివరకూ అనేక చిత్రాల్లో హీరోగా నటించినా మొదటిసారి ఈ చిత్రం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యానని కథానాయకుడు నిఖిల్ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.