ఆంధ్రప్రదేశ్‌

స్వర్ణ్భారతి సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి:రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: స్వర్ణ్భారత్ ట్రస్ట్ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఆయన స్వర్ణ్భారత్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాజీ దేశ్‌ముఖ్‌ను ఆదర్శంగా చేసుకుని నడుస్తున్న ఈ ట్రస్ట్ సేవలు గ్రామీణ వికాసానికి మార్గదర్శిగా నిలవాలని అన్నారు. స్వచ్ఛ్భారత్ రూపొందించటమే గాంధీజీకి మనం అందించే నివాళి అని అన్నారు. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సేవల వల్లే తనకు మానసిక ఆనందం కలుగుతుందని అన్నారు. నా పిల్లలిద్దరూ ట్రస్ట్ కార్యకలాపాలను చూసుకోవటం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక్కడి ఆదర్శ విద్యాలయంలో విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో పెరుగుతూ ఉన్నతస్థాయికి వెళుతున్నారని అన్నారు. ఆదర్శవంతమైన యువతను తయారుచేస్తున్నామని చెప్పారు. వ్యవసాయం మనదేశ సంస్కృతి అని ఇందులో ఆధునిక మెళకువలు తీసుకురావాలని అన్నారు. ఇందు కోసం స్వర్ణ్భారత్ ట్రస్ట్ విశేష కృషి చేస్తుందని తెలిపారు. సతీ సమేతంగా వచ్చిన రాష్టప్రతి దంపతులను ట్రస్ట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. దేనీకి వెరవని మనస్తత్వం వెంకయ్యనాయుడదని రాష్టప్రతి అభినందించారు.