జాతీయ వార్తలు

సైనిక పురస్కారాలు ప్రదానం చేసిన రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సైన్యంలో విశేష సేవలందించిన సైనికులకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాలను అందజేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటూ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి మరణానంతరం పురస్కారాలు అందజేశారు. సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేసిన ప్రదీప్ కుమార్‌కు మరణానంతరం కీర్తిచక్ర అందజేశారు. ఈ పురస్కారాన్ని ఆయన భార్య అందుకున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన విజయ్ కుమార్‌కు కీర్తి చక్ర పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని విజయ్ భార్య.. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.ఇక లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ కుమార్‌కు ‘ఉత్తమ యుద్ధ సేవా మెడల్’ పురస్కారాన్ని అందుకున్నారు.