మహబూబ్‌నగర్

కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాలువలకు నీటిని విడుదల చేయాలని కలెక్టరేట్ ముట్టడి
మహబూబ్‌నగర్, మార్చి 15: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రెండురోజులుగా కలెక్టరేట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కోయిల్‌సాగర్ ఆయకట్టుకు సంబందించిన వివిధ గ్రామాల రైతుల కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా కలెక్టరేట్‌లోనే అక్కడక్కడ కూర్చున్న రైతులు మధ్యాహ్నం వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తుందని భావించారు. తీరా కలెక్టర్ సాయంత్రం వరకు కలెక్టరేట్‌కు చేరుకోకపోవడంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ ఆవరణలో ధర్నాకు దిగడంతో పోలీసులు అడ్డుకుని వారిని బయటకు పంపించారు. దాంతో హైదరాబాద్- రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భైఠాయించి గంటల తరబడి రాస్తారోకోకు దిగారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 12 ఫిట్ల నీరు ఉందని మహబూబ్‌నగర్‌కు మూడు నెలలుగా తాగునీరు ఇచ్చేందుకు మూడు ఫిట్లు అవసరం ఉంటుందని రైతులు తెలిపారు. మిగితా 9 ఫిట్లలో తమకు రెండు ఫిట్లకు సంబందించిన నీటిని కోయిల్‌సాగర్ ఆయకట్టు కాలువలకు వదలలాని రైతులు డిమాండ్ చేశారు. నీరు వదిలితే పశువులకు దాహర్తికి ఉపయోగపడుతుందని అదేవిధంగా అక్కడక్కడ వేసిన ఆరుతడి పంటలను కూడా కాపాడుకుంటామని కొన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా కూడా జరుగుతుందని రైతులు వాపోయారు. కలెక్టర్ వచ్చేవరకు తాము ఆందోళన విరమించేది లేదని గత రెండు రోజులుగా కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో రోడ్డుపై భైఠాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు వెంట పురుగుల మందు తెచ్చుకోవడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు వెనుకంజ వేశారు. ఆరెస్టు చెద్దామనుకుంటే పురుగుల డబ్బాలు ఉండడంతో పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. కలెక్టరేట్‌కు జిల్లా కలెక్టర్ రావాలంటూ సాయంత్రం పొద్దుపోయేదాకా కలెక్టర్ కార్యాలయం ఎదుటనే రైతులు రాస్తారోకో, ధర్నాను కొనసాగించారు. చివరగా కలెక్టర్ నాగర్‌కర్నూల్‌లో జరిగిన కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ టికె శ్రీదేవి రైతులను క్యాంపు కార్యాలయానికి రావాలంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దింతో రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కలెక్టర్‌తో మాట్లాడుతూ తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో నీటి విడుదల కలెక్టర్ పరిధిలో ఉంటుందని చెప్పడంతో తాము గత రెండు రోజుల నుండి ఇక్కడే ఉన్నామని రైతులు వాపోయారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి కోయిల్‌సాగర్‌లోని నీటిని కాలువలకు విడుదల చేసేందుకు సంబందిత అధికారులతో చర్చిస్తానని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. కాగా రైతులు గంటల తరబడి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేయడం పోలీసులు వాహనాలను మళ్లించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భధ్రత చర్చలు చేపట్టారు. వందలాది మంది తరలిరావడం అందులో కొందరు రైతులు క్రిమీసహరక మందుల డబ్బాలు తీసుకురావడంతో పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు.