విశాఖపట్నం

ఇసుకపై చంద్రబాబువి అసత్యపు పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు
* డ్వాక్రా సంఘాలకు దక్కేదేమీ లేదు
* బాక్సైట్ అనుమతితో గిరిజనులకు ఒరిగేమీ ఉండదు
* వైకాపా అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి
విశాఖపట్నం, నవంబర్ 27: ఇసుకు తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శే్వతపత్రం పూర్తి అబద్దాల కరప్రతమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అమలు చేస్తున్న ఇసుక నూతన విధానం వల్ల బాగుపడింది ఆయన మంత్రి వర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనన్నారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించి వారికి ఆర్థిక సావలంబన కల్పించామని చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క సంఘం ఆర్థికంగా బలోపేతమైందని నిరూపించగలరాని ప్రశ్నించారు. ఇసుకు మాఫియాను పెంచి పోషిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆపార్టీ నాయకులకు మేలు చేకూరుస్తోందని ఆరోపించారు. బాబు మంత్రివర్గంలోని మంత్రులు దేవినేని ఉమ, కె అచ్చెన్నాయుడు ఇసుక అక్రమాలకు తెరతీశారన్నారు. ఉత్తరాంధ్రలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇసుక అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జిఓను తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు చెప్తున్న ప్రభుత్వం ఇంకా గిరిజనులను మోసగించేందుకు యత్నిస్తోందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ తవ్వకాలకు నిర్ణయం తీసుకున్నప్పటికీ గిరిజనుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని విరమించుకుందని గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక అర్ధం ఏమిటని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాల ఒప్పందాల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి వర్గ సహచరులు, పార్టీ కీలక నేతల వ్యక్తిగత లబ్ది ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి, మోసగించే విధానాలను విరమించుకోవాలని ఆయన హితవు పలికారు.