కృష్ణ

జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపిన మంత్రి నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన జనతా కర్ఫ్యూను ఇంకొంచెం ఓపికతో కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7గంటల నుండి మంత్రి కొడాలి నాని రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు బాల్కనీ దగ్గరకు వచ్చి కరోనా వైరస్‌పై పోరుకు సమైక్యత చాటుతూ అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతలు తెలపడంలో భాగంగా చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని సమూలంగా నిర్మూలించాలంటే సోమవారం ఉదయం 6గంటల వరకు స్వచ్చంధంగా జనతా కర్ఫ్యూను యథాతథంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. కరోనా నేపథ్యంలో దేశంలోని 75జిల్లాలను కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌గా ప్రకటించిందని చెప్పారు. లాక్‌డౌన్ ప్రకటించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, ప్రకాశం, విశాఖ జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఇళ్ళకు పరిమితం కావాలని సూచించారు. నిత్యావసర సరుకులు, పాలు వంటివి అందుబాటులోనే ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండవ దశకు చేరిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా యువత కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా అంతటా 144వ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. నలుగురైదుగురు ఒకేచోట గుమికూడి ఉండవద్దని, దీనివల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని వైద్యులు సూచిస్తున్నారని, ఈ సూచనలను అందరూ పాటించాలన్నారు. ఉదయం 7గంటల నుండి జనతా కర్ఫ్యూను సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ దగ్గరే ఉంటూ కరోనా వైరస్ నివారణకు తమవంతు తోడ్పాటునందించడం అభినందనీయమని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇదిలా ఉండగా జనతా కర్ఫ్యూ గుడివాడలో పూర్తిగా విజయవంతమైంది. ప్రజలు ఎక్కడికక్కడే ఇళ్ళకే పరిమితమయ్యారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లు నిర్మానుష్యంగా మారాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పట్టణంలోని అన్ని ప్రాంతాలనూ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.