క్రాంతిమాధవ్ చిత్రంలో శర్వానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ ఈమధ్య టాలీవుడ్‌లో రింగ్‌రాజాగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’లాంటి మంచి హిట్స్ ఆయన ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ‘రాజాధిరాజా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. శర్వానంద్‌తో ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ వంటి ఫీల్ గుడ్ ప్రేమకథను అందించిన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథాచర్చలు జరుగుతున్నాయి. ఈసారి కూడా ఓ ఫీల్‌గుడ్ మూవీతో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.