కృష్ణ

మెట్రోరైలు మార్గంలో జపాన్ బృందం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు (ఎఎంఆర్‌పి) పనుల క్షేత్రస్థాయి ప్రణాళికలపై అవగాహనకు సిజి, తాకాజి ఆధ్వర్యంలోని జపాన్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా 26.03 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్‌ను సోమవారం పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ టెర్మినల్ - బందరు రోడ్డు - పెనమలూరు ప్రాంతంలో నిర్మించతలపెట్టిన కారిడార్-1 ప్రాంతాన్ని అదే విధంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ టెర్మినల్ - ఏలూరు రోడ్డు - నిడమానూరు కారిడార్ ప్రాంతాలను అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్‌పి రామకృష్ణారెడ్డి, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డిఎంసి) ప్రాజెక్ట్ డైరక్టర్ రాధాకృష్ణారెడ్డి, ఎఎంఆర్‌పి కన్సల్‌టెంట్లు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అభివృద్ధిపై ఒక అవగాహనకు రావడం జరిగిందని అధికారులు తెలిపారు.
క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ప్రాజెక్టుపై రూపొందించిన ప్రజంటేషన్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ బృంద సభ్యులకు పిపిటి ద్వారా స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివరించడం జరిగింది. ప్రాజెక్టు రూపకల్పన ప్రతిపాదిత అంశాలపై బృందం సంతోషాన్ని వ్యక్తపరచినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నిర్వహించే బిడ్డింగ్‌లో పాలుపంచుకునేందుకు బృందాల ప్రతినిధులు ఆసక్తి తెలియపరచారని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో జపాన్‌కు చెందిన మెటి బృందం డైరక్టర్ జనరల్ సౌత్ వెస్ట్ ఆసియా సిజి తకాజి, ఫైనాన్స్ కార్పొరేషన్ డిడి కికూ టాకి, అసిస్టెంట్ డైరక్టర్ ఎంఐఎల్‌ఐటి, యోషియుకి నాగాసాక, ఇడి, జెఒఆర్‌ఎస్‌ఎ ట్యూటోము, సింగపూర్ బ్రాంచికి చెందిన హిరోషికోనో, హిటాచి ఇండియా జనరల్ మేనేజర్ హార్యుమిట్యుహాషి, ట్రాన్స్‌పోర్ట్ విభాగం డైరక్టర్ మిట్యుహిరోమి సాకి, ఓవర్సీస్ సెల్ డిపార్ట్‌మెంట్ జిఎం హాచిరో ఆరై, ఓవర్సీస్ అసిస్టెంట్ మేనేజర్ ఆయా ససనో, జైకా ప్రతినిధి తానిగూచి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ జోన్-1పై పోరాటం ఆగదు
జి.కొండూరు, ఫిబ్రవరి 8: వ్యవసాయజోన్-1పై పోరాటం ఆగదని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కందులపాడు క్రాస్‌రోడ్ నుంచి సోమవారం అఖిలపక్ష నాయకులంతా కలసి భారీ ర్యాలీగా విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయానికి తరలివెళ్ళారు. జి.కొండూరు మండలాన్ని వ్యవసాయజోన్-1 నుంచి తొలగించాలని కోరుతూ వినతిప్రతం సమర్పించారు. జి.కొండూరు జడ్పీటిసి కాజ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన 5,000కు పైగా అభ్యంతర డిక్లరేషన్ పత్రాలను సిఆర్‌డిఎ అధికారులకు అందజేశారు. ఈసందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నీళ్ళు లేని మెట్టప్రాంతాన్ని వ్యవసాయజోన్-1గా ప్రతిపాదించారన్నారు. దీంతో ప్రభుత్వం సింగపూర్ కంపెనీల చేతిలో కీలుబొమ్మగా మారిన విషయం తేటతెల్లమైందన్నారు. కెడిసిసిబి ఉపాధ్యక్షుడు వేములకొండ రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై టిడిపి నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నార