కృష్ణ

కౌన్సిల్ పాలక మండలిలో విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 8: నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లలో విబేధాలు భగ్గుమన్నాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం 53వ డివిజన్‌లో ఒక కమ్యూనిటీహాల్ నామకరణం విషయంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకు మల్లికార్జున రావు లు కౌన్సిల్ సాక్షిగా ప్రతిపాదనపై వాగ్వాదం చేసుకోగా ప్రస్తుతం ఏకంగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రవర్తనపై నగర ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు ఫిర్యాదు చేయగా నగర ఎమ్మెల్యేలకు కూడా తమ గోడును విన్నవించుకొంటున్న వైనం గమనార్హం కాగా ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే కౌన్సిల్ పాలక మండలి అయిన నగర తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లలో నెలకొన్న అంతర్యుద్ధాన్ని అంచనా వేయవచ్చు. స్టాండింగ్ కమిటీ సభ్యులైన కొంతమంది కార్పొరేటర్లపై మేయర్ అనుచితంగా వ్యవహరించడమే కాకుండా నిందారోపణలు చేస్తున్న వైనంపై ప్రస్తుత వివాదానికి కారణమైంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి వచ్చిన విఎంసి షాపుల యాజమాన్య పేరుమార్పుల విషయంలో జరిగే మ్యూటేషన్ ప్రక్రియపై స్టాండింగ్ కమిటీ సభ్యులమైన తమపై లేనిపోని నిందారోపణలు మేయర్ చేశారన్నది ఆ సభ్యుల వాదనగా ఉంది. విషయంలో నిజా నిజాలు పక్కన పెడితే మేయర్‌గా శ్రీ్ధర్ ఇటు స్టాండింగ్ కమిటీలోనూ, కౌన్సిల్‌లోనూ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. అంతేకాకుండా కమిటీ సమావేశానికి వచ్చిన ప్రతిపాదనల ఆమోదాలు, తీర్మానాలు, చర్చ వంటి ప్రక్రియలో తమకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఏకపక్షంగాను, నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మేయర్ శ్రీ్ధర్ తమపై ఏ విధంగా నిందారోపణలు చేస్తాడన్నది సభ్యుల ప్రశ్న. ఈవిషయాన్సి సీరియస్‌గా తీసుకొన్న స్టాండింగ్ కమిటీ సభ్యులైన కాకు మల్లికార్జున రావు, కె అనూరాధ, నాగోతి నాగమణి, పిరియా జగదాంబలు మేయర్‌పై లిఖిత పూర్వకంగా నగర పార్టీ పెద్దలైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతోపాటు నగర పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావుకు కూడా ఫిర్యాదు చేసేందుకు పూనుకొన్నారు. ఇదిలా ఉండగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌పై కార్పొరేటర్లు తిరుగుబాటు బావుట ఎగురేసిన ఘటనలు గతంలోనూ లేకపోలేదు. తీవ్ర వివాదాల నడుమ కౌన్సిల్ ఆమోదం పొందిన కనకదుర్గా లే అవుట్, విఎంసి మొబైల్ ఆప్, తోపాటు పలు ముఖ్య అంశాలపై మేయర్‌పై విపక్షాల కన్నా మరింత ఘాటైన విమర్శలు చేసిన ఘటనలు కార్పొరేటర్ల మదిలో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్న తమ వాదనలే కాకుండా నగర కార్పొరేటర్లందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునేందుకు పార్టీ పెద్దలతో కమిటీ విచారణ చేపట్టి కార్పొరేటర్ల మనోభావాలు దెబ్బతినకుండా మేయర్ శ్రీ్ధర్ తీరు మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యుల వాదన కాగా ఈవిషయంపై నగర పార్టీ పెద్దలు ఏయే చర్యలు తీసుకొంటారన్నది సర్వత్రా ఉత్కంఠగా ఉంది.

81శాఖల్లోఈ-ఆఫీసు అమలు చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 8: నాకొక్కడికే ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్స్ పంపిస్తే సరిపోదని పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. ఈ-ఆఫీస్ నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులను ఉపేక్షించేదని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ఈ-ఆఫీస్, ఉపాధి హామీ పథకం, ఎన్‌టిఆర్ జలసిరి తదితర పథకాలపై సమీక్షించారు. 81 శాఖల్లో ఈ-ఆఫీస్‌ను తీసుకువచ్చామని, కానీ పూర్తి స్థాయిలో అమలు జరగకపోవటం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులకే ఈ-ఆఫీస్‌పై అవగాహన కొరవడటం బాధాకరమన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలు ఉపాధి పనుల నిర్వహణకు అనుకూలంగా ఉంటాయన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్కడ ఎక్కువ పనులు చేస్తే ఆ ప్రాంతానికి ఆ స్థాయిలో నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. పనులు చేసిన కూలీలకు మూడు రోజుల్లో చెల్లింపులు జరగాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాకు 11వేల బోర్‌వెల్స్ మంజూరైనట్లు తెలిపారు. రైతులు తమ పొలాల్లో చిన్న చిన్న సాగునీటి కుంటలు తవ్వుకునే వారికి బోర్‌వెల్ మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్వామా, భూగర్భ శాఖ, రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులు సంయుక్త సహకారంతో ఈ పథకం అమలుకు కృషి చేయాలన్నారు. కుళాయిలు లేని సంక్షేమ హాస్టల్స్‌ను గుర్తించి తక్షణమే కుళాయిలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి కృష్ణకుమారిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ఆర్డీవో సాయిబాబు, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖర్, డియస్‌ఓ రవి కిరణ్, డిఇఓ సుబ్బారెడ్డి, జడ్‌పి సిఇఓ నాగార్జున సాగర్ తదితరులు పాల్గొన్నారు.