కృష్ణ

మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.కోటి ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: మార్కెట్ ధర ప్రకారం ఎకరానికి కోటి రూపాయల ధర చెల్లించకుంటే ప్రభుత్వమే విషం ఇచ్చి చంపాలని జి.కొండూరు-ఆత్కూరు-చెవుటూరు బైపాస్ బాధిత రైతులు వాపోయారు. జి.కొండూరులో గురువారం బైపాస్ బాధిత రైతులు కదం తొక్కారు. విజయవాడ - జగదల్‌పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే పెట్రోలు పోసుకుని తగుల బెట్టుకుంటామని హెచ్చరించారు. వీరికి సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి, ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజాసంఘాలు మద్దతు పలికి రాస్తారోకోలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2011లోనే జి.కొండూరులో ఎకరం భూమి 72,60,000 లకు మైలవరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు నెంబరు 2774/2011గా రిజిస్టర్ కాబడిందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎకరం విలువను 9,68,000 రూపాయలుగా పేర్కొందన్నారు. ఇది ముమ్మాటికీ రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. మంత్రి ఉమ లేదా కలెక్టర్ స్వయంగా జి.కొండూరు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. వారం క్రితమే రాస్తారోకో చేశామని, ఈనెల 10లోపు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చి అధికారులు మాట తప్పారన్నారు. అందుకే మళ్ళీ రాస్తారోకోకు దిగామన్నారు. రైతుల బ్యాంక్ ఖాతాల నెంబర్లు ఇవ్వకపోయినా బ్యాంకుల నుంచి సేకరిస్తున్నారన్నారు. తమకు ఇప్పుడు చెల్లించే నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేకున్నా బలవంతంగా బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు అధికారులు కుట్రపన్నుతున్నారన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ సలోని సిదాన, తహశీల్దార్ కె సుధారాణి అక్కడకు చేరుకుని విజయవాడలో జెసి గంధం చంద్రుడుతో చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అప్పటికే రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయడం వల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంపిపి వేములకొండ తిరుపతిరావు, జడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, పులిపాక థామస్, మాజీ ఎంపిపి వుయ్యూరు నరసింహారావు, పటాపంచుల నరసింహారావు, మందా జక్రి, పజ్జూరు తిరుపతిరావు, పివి ఆంజనేయులు, పర్సా రామయ్య మాదిగ, మండల శేఖర్‌బాబు, మాదాసు కొండలరావు, పుచ్చకాయల నరసింహారావు, భాస్కరరెడ్డి, పుప్పాల సుబ్బారావు తదితరులు రైతులతో పాల్గొన్నారు. వీరంతా విజయవాడకు వెళ్ళి జెసితో చర్చించారు. ఈ చర్చల్లో వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకూ రైతులకు న్యాయం చేస్తామని బాధిత రైతులకు జెసి హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేయకపోతే మళ్ళీ రోడ్డెక్కుతామని రైతులు పేర్కొన్నారు.

ఘంటసాల పాటలు
అజరామరం
* వర్ధంతి సభలో ఘన నివాళులు
అవనిగడ్డ, ఫిబ్రవరి 11: స్థానిక ఘంటసాల అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతి గురువారం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఘంటసాల గీతాలు అజరామరమన్నారు. పాతబడినా నేటి యువతరాన్ని ఉర్రూతలూగించే ఘంటసాల పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఈసందర్భంగా ఘంటసాల పాటల పోటీలు నిర్వహించగా దాదాపు 70మంది పాల్గొన్నారు. ఎం వెంకటేష్, కె చంద్రశేఖర్, పి వెంకటేశ్వరరావు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందగా రూ.1500, రూ.వెయ్యి, రూ.500 నగదు బహుమతులను అందజేశారు. ఎన్‌ఆర్‌ఐ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్