కృష్ణ

కృష్ణా పుష్కరాలకు పక్బందీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కర ఏర్పాట్లపై గురువారం ఆయన బందరు, గుడివాడ, నూజివీడు, అవనిగడ్డ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాముఖ్యత కలిగిన ఘాట్లు, విఐపిల తాకిడి ఉండే ఘాట్లను గుర్తించాలని ఆదేశించారు. వేదాద్రి, ముత్యాల, కోటిలింగాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. కోడూరు మండలం హంసలదీవి ఘాట్ అత్యంత ప్రమాదకరమైనందున అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు గజ ఈతగాళ్లు, పడవలు ఏర్పాటు చేయాలన్నారు. లోతు ఎక్కువ ఉన్న ఘాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్వేస్టేషన్, బస్టేషన్‌ల నుండే క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్లకు వెళ్లేందుకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పిండప్రదానాలను వీలైనంత దూరంలో నిర్వహించేలా చూడాలన్నారు. ఘాట్ల వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి అనుక్షణం పరిశీలించాలన్నారు. బందోబస్తుకు వచ్చే సిబ్బందికి వసతి ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల రద్దీని గమనిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ బివిడి సాగర్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ పి జయరాజు, బందరు, అవనిగడ్డ, నందిగామ డిఎస్పీలు శ్రావణ్ కుమార్, ఖాదర్ బాషా, రాధేష్ మురళీ, ఎఆర్ డిఎస్పీ ఎస్‌ఎస్‌ఎస్‌వి కృష్ణారావు, బందరు రూరల్, చల్లపల్లి, అవనిగడ్డ, కంచికచర్ల, జగ్గయ్యపేట సిఐలు పాల్గొన్నారు.

సాగు నష్టాలతో కౌలురైతు బలవన్మరణం
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 11: నమ్ముకున్న మట్టితల్లి కరుణించక పోవటం, ఆశించిన దిగుబడులు రాకపోవటంతో నష్టాల్లో కూరుకుపోయిన ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని చాగంటిపాడు గ్రామానికి చెందిన మర్రెడ్డి వెంకటరెడ్డి ఐదేళ్లుగా పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాడు. ఇప్పటికి రూ.4లక్షలు దాకా అప్పుల పాలయ్యాడు. ప్రతి సంవత్సరం అప్పులు చేస్తూ వ్యవసాయం చేసి ఎంతకొంత అప్పులు తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మాగాణి పొలం ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వరి విత్తనాలు కొంతమేర కల్తీవి కావటంతో పంట దిగుబడి అంతంతమాత్రమే వచ్చింది. వచ్చిన డబ్బులు పొలం యజమానికి చల్లించటానికే సరిపోయాయి. చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. మళ్లీ రెండో పంటగా మినుము వేశాడు. ఆ విత్తనాలు కూడా కల్తీవి కావటంతో మినుము కాయలు కాయలేదు. కొంత భాగం చీడపీడలు సోకటంతో పురుగుల మందలు తెచ్చి స్ప్రే చేశాడు. ఈ మందులు ఏమాత్రం ప్రభావం చూపకపోవటంతో వెంకటరెడ్డి దిగాలు చెందాడు. ఇంత కష్టపడి అప్పులు తెచ్చి వ్యవసాయం చేసినా మంచిరేటు ఉన్నప్పుడు మంచి దిగుబడులు రాకపోవటంతో అప్పులు ఎలాతీర్చాలో తెలియక బుధవారం పురుగుల మందు తాగాడని స్థానిక రైతులు తెలిపారు. స్థానికులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుఝామున మృతిచెందాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేషు వెళ్లి భార్య శేషమాంబ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురువారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టంకు తరలించామని జ్ఞానేషు తెలిపారు. కొనేళ్లుగా వ్యవసాయంలో తీవ్ర ఆర్థిక నష్టాలు వచ్చాయని, దీంతో బయట అప్పులు కూడా పుట్టటం లేదని, మనస్థాపంతో గ్రామోక్సన్ కలుపుమందు తాగాడని భార్య ఫిర్యాదులో తెలిపింది.