కృష్ణ

అంతర్జాతీయ గుర్తింపుతోనే కళాకారుల జీవన స్థితిగతులు మెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అంతర్జాతీయ స్థాయిలో గుర్తిపు పొందేలా హస్తకళలను రూపొందించడం ద్వారా హస్తకళాకారులు జీవన ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డి.లక్ష్మిపార్థసాథి భాస్కర్ అన్నారు. కేంద్ర హాండి క్రాఫ్టు మరియు లేపాక్షి హాండీక్రాప్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్తానిక పిడబ్ల్యుడి గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన లేపాక్షి క్రాఫ్టు బజారు 2016 అఖిల భారత హస్తకళల ప్రదర్శనను శుక్రవారం సాయం త్రం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ డి.లక్ష్మీపార్థసారథి భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అత్యంత ప్రసిద్ధి చెందిన హస్తకళలకు దేశంలోనే కాక విదేశాల్లో సైతం డిమాండ్ ఉందన్నా రు. హస్తకళాకారుల ఉత్పత్తుల తయారీలో అధునాతన డిజైన్లపై కళాకారులకు శిక్షణ అందిస్తే మరిన్ని కళాత్మకమైన ఉత్పత్తులను తయారు చేయగలుగుతారన్నారు. కళాకారులు తయా రు చేసిన ఉత్పత్తులకు దేశ విదేశాల్లో మార్కెట్ సౌకర్యం కల్పించడంపై అధికారులు మరింత శ్రద్ధ వహించాలన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై వినియోగదారులకు అందించాలన్న లక్ష్యంతో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శనలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. హస్తకళాకారుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వారిలో ఉన్న కళలను గుర్తించి వారికి ప్రోత్సాహకాలను అందిస్తున్నారన్నారు. ప్రదర్శనల్లో అమ్మకాల ద్వారా హస్తకళాకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.లేపాక్షి హాండిక్రాఫ్ట్ జనరల్ మేనేజర్ ఐవి లక్ష్మీనాథ్ మాట్లాడుతూ లేపాక్షి క్రాఫ్ట్ బజారు నందు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకు 220 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రదర్శనలో కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ పెరల్స్, మిటల్ కస్టంగ్ నిర్మల్ పెయింటింగ్స్ తదితర ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారన్నారు. చేనేత వస్త్రాలు తక్కువ ధరకే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయడం ద్వారా కళాకారులకు జీవనోపాథికి చేయూతనందించాలని ఆయన కోరారు.ఈ ప్రదర్శన 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రదర్శన ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హాండిక్రాప్టు డెవలప్‌మెంట్ కమిషన్ ఫైనాన్స్ మేనేజరు బసవరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్‌కుమార్, రీజనల్ మేనేజరు ఎఎమ్‌డిసి నరసింహులు, లేపాక్షి సిబ్బంది ఉమామహేశ్వరరావు, రామారావు తదతరులు పాల్గొన్నారు.

‘మడ’ స్థితిగతులను పరిశీలించిన చైనా బృందం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 18: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) మాస్టర్ ప్లాన్ తయారీకి ముందుకు వచ్చిన చైనాకు చెందిన జిఐఐసి ప్రతినిధుల బృందం శుక్రవారం పట్టణంలో పర్యటించింది. తొలుత కలెక్టరేట్‌లోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి వచ్చిన ఆ బృంద సభ్యులు ఆర్డీవో సాయిబాబుతో భేటీ అయి ‘మడ’కు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఏర్పాటైన మడ భౌతిక స్వరూపాన్ని, బందరు స్థితిగతులను ఆర్డీవో సాయిబాబు ద్వారా తెలుసుకున్న బృందం మాస్టర్ ప్లాన్ తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసింది. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రతిపాదిత భూములు, మడ అభివృద్ధికి సంబంధించిన మ్యాప్‌లను చైనా బృందానికి చూపించారు. రాజధాని ప్రాంత తరహాలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేశారు. ఈ ప్రాంతానికి ఉన్న రహదారులు, రైల్వే కనెక్టివిటీ గురించి వివరించారు. జిఐఐసి సిఇఓ జంగ్ జావో తమ సంస్థ కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు తెలియజేశారు. అనంతరం చైనా బృందం మంగినపూడి బీచ్, తవిసిపూడి, కరగ్రహారం ప్రాంతాల్లో పర్యటించి పోర్టు ప్రతిపాదిత భూములను పరిశీలించారు. అలాగే బందరు కోటలోని పాత ఓడరేవు ప్రాంతాన్ని, అక్కడి పురాతన జెట్టీలను పరిశీలించారు. గతంలో బందరు పోర్టు నుండి జరిగిన ఎగుమతులు, దిగుమతుల గురించి ఆర్డీవో చైనా బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో నవయుగ ప్రతినిధి తుమ్మల సుబ్బారావు, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ బడ్జెట్ ఏకగ్రీవం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 18: మచిలీపట్నం పురపాలక సంఘానికి సంబంధించి 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.133.43లక్షల ముగింపు నిల్వ బడ్జెట్‌కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ హాలులో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తొలుత 2015-16 సంవత్సరానికి రూ.186.33లక్షలతో సవరించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ఆమోదించింది. గతంలో రూ.1689.87లక్షలు ప్రారంభ నిల్వగా చూపించి ముగింపు నిల్వను రూ.1828.52లక్షలుగా చూపించారు. క్యాపిటల్ పద్దు ఖాతా కింద మినహాయింపులు పోను ప్రారంభ నిల్వ రూ.278.08లక్షలుగా, ఆదాయం రూ.7051.25లక్షలుగా, వ్యయం రూ.7143.10లక్షలుగా బడ్జెట్ అంచనాలను రూపొందించారు. ఈ లెక్కల ప్రకారం ముగింపు నిల్వ రూ.186.23లక్షలుగా సవరించారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ప్రారంభ నిల్వ రూ.1828.52లక్షలు, ఆదాయం రూ.2087.20లక్షలుగా, వ్యయం రూ.1982.00లక్షలు, ముగింపు నిల్వ రూ.1933.72లక్షలుగా చూపించారు. క్యాపిటల్ పద్దు ఖాతాను ప్రారంభ నిల్వ నుండి మినహాయించి, ఆదాయం, వ్యయాలకు క్యాపిటల్ పద్దును కలపగా ప్రారంభ నిల్వ రూ.186.23లక్షలు, ఆదాయం రూ.5473.20లక్షలు, వ్యయం రూ.3544.00లక్షలుగా చూపించారు. రూ.133.43లక్షల ముగింపు నిల్వతో 2016-17 వార్షిక బడ్జెట్ అంచనాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. జనరల్ ఫండ్ నుండి అభివృద్ధి కార్యక్రమాలకు రూ.668లక్షలు, షెడ్యూల్డు కులాల వారికి రూ.114.23లక్షలు, షెడ్యూల్డు తెగల వారికి రూ.35.40లక్షలు, స్ర్తి సంక్షేమానికి రూ.33.40లక్షలు, స్లమ్ అభివృద్ధికి రూ.193.99లక్షలను కేటాయించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాన్ని కోరారు. గతంలో ఏ పాలకవర్గం ప్రవేశ పెట్టని విధంగా తమ పాలకవర్గం భారీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. అన్ని వర్గాల ఆమోదయోగ్యంగా బడ్జెట్ అంచనాలు తయారు చేశామన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉందని విమర్శించారు. కేటాయింపులు చూపుతున్నా అందుకు తగ్గట్టు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. గత బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులను ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డుల్లో ఏ మాత్రం ఖర్చు చేయలేదని వైసిపి కౌన్సిలర్ గూడవల్లి నాగరాజు ఆరోపించారు. ఈ విడత బడ్జెట్ నిధులైనా ప్రాధాన్యతా క్రమంలో వైసిపి వార్డుల అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కమిషనర్ జస్వంతరావు, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), టిడిపి కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, కొట్టె వెంకట్రావ్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, బత్తిన దాస్, లోగిశెట్టి వెంకటస్వామి, ప్రతిపక్ష నేత అచ్చాబా, వైసిపి కౌన్సిలర్లు లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, శీలం బాబ్జి, కాగిత జవహర్ తదితరులు పాల్గొన్నారు.