కృష్ణ

‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. మాల్‌ప్రాక్టీస్‌కు అస్కారం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. అత్యంత సమస్యాత్మకమైన ఐదు కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 983 పాఠశాలలకు చెందిన 59వేల 876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 56వేల 727 మంది రెగ్యులర్, మిగతా 3వేల 149 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 287 కేంద్రాలను గుర్తించారు. రెగ్యులర్ విద్యార్థులకు 265, ప్రైవేట్ విద్యార్థులకు 22 కేంద్రాలను కేటాయించారు. 287 కేంద్రాలను ఎ, బి, సి కేటగిరీలుగా ఎంపిక చేశారు. ‘ఎ’ కేటగిరికి సంబంధించి 151, ‘బి’ కేటగిరికి సంబంధించి 46, ‘సి’ కేటగిరికి సంబంధించి 58 కేంద్రాలను ఎంపిక చేయగా ప్రైవేట్ సెంటర్స్‌గా 22 ఎంపిక చేశారు. 3500 మంది ఇన్విజిలేటర్ల నియామకం జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ అధికారిని నియమించారు. జిల్లాను 24 రూట్లుగా విభజించగా ప్రతి రూట్‌కు ఒక రూట్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ రూట్ ఆఫీసర్‌ను నియమించారు. 27 సిట్టింగ్, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.
సిసి కెమెరాల ఏర్పాటు
జిల్లాలో 27 సమస్యాత్మ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించగా, వీటిలో ఐదింటిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. చల్లపల్లిలోని ఎస్‌ఆర్‌వైఎస్‌పి జూనియర్ కళాశాల, పామర్రు జెడ్పీ హైస్కూల్ (బాలుర) బి సెంటర్, చాట్రాయి జెడ్పీ హైస్కూల్, విజయవాడ రూరల్ మంతెన జెడ్పీ హైస్కూల్, వత్సవాయి జెడ్పీ హైస్కూల్ బి సెంటర్లలో నాలుగు చొప్పున సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే సిసి కెమెరాలు ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో కూడా వాటిని వినియోగించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఫర్నిచర్ సమస్య లేదు:డిఇఓ
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఫర్నిచర్ కొరత లేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎ సుబ్బారెడ్డి శనివారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. పరీక్షల కోసం ఎంపిక చేసిన 287 కేంద్రాలలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఉందన్నారు. ఈ ఏడాది విద్యార్థులు నేల మీద కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం రాదన్నారు. గత రెండు మూడు నెలలుగా ఫర్నిచర్ సమస్యపై దృష్టి సారించగా 46 కేంద్రాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే ఆ కేంద్రాలకు సమీపంలోని పాఠశాలల ఫర్నిచర్‌ను సమకూర్చామని చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విధిగా ఫ్యాన్, లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఎఎన్‌ఎంతో ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాన్ని కల్పించామని సుబ్బారెడ్డి వివరించారు.