కృష్ణ

బ్రూణహత్యలు నివారించకపోతే సమాజ మనుగడ ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బ్రూతహత్యలు నివారించకపోతే సమాజంలో మహిళల మనుగడ ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఆదివారం గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం సావిత్రి కళాపీఠం 10వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ఇలా కొనసాగితే సమాజ నిర్మాణం ప్రమాదంలో పడే అవకాశం వుందన్నారు మహిళల పట్ల వివక్షను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ఆమె కోరారు. ఈ మధ్యకాలంలో మహిళలపై మహిళలే శత్రువులుగా మారుతున్న అంశాలు కనపడుతున్నాయని ఇది ఏదైనా మహిళా సమస్య కాదని సమాజ సమస్యని ఆమె అన్నారు. అనంతరం సావిత్రి కళాపీఠం 10వ వార్షికోత్సవం అలాగే సావిత్రి 80వ జయంతి సందర్భంగా ప్రకటించిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు స్మారక పురస్కారాన్ని కళాపీఠం గౌరవాధ్యక్షులు ప్రభల శ్రీనివాస్, అధ్యక్షురాలు పి.విజయలక్ష్మిలు ముఖ్య అతిధుల చేతుల మీదుగా జివివిఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించగా సావిత్రి కుమార్తె విజయఛాముండేశ్వరి, ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్యగుప్తా, కె.శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి తోట కృష్ణకిషోర్, నారుమంచి నారాయణ, ఎంఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.