కృష్ణ

సమర్ధతతకు నిలువెత్తు నిదర్శనం ‘బాబు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 9: రాష్ట్ర విభజన నేపథ్యంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధి విషయంలో 10.99 శాతం వృద్ధి రేటు సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమర్ధతకు నిదర్శనమని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కేవలం 9.5శాతం వృద్ధి రేటు సాధించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషి ఫలితంగానే వృద్ధి రేటులో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. పోలవరం నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్రంలో విస్తారంగా ఫాం పాండ్స్ ఏర్పాటు చేసి పడిన ప్రతి నీటి బొట్టును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ విధంగా 90 టియంసిల నీటిని భూగర్భంలో దాచే విధంగా సకల చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం అభివృద్ధి విషయానికొస్తే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా బందరును తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని బందరు మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.2.60కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రూ.1.50కోట్లతో ఐదు పుష్కర ఘాట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే మచిలీపట్నం నుండి చిన్నాపురం మీదుగా కమ్మవారి చెరువు వరకు రూ.10.50కోట్లతో డబ్లింగ్ లైన్ నిర్మాణ పనులకు త్వరలోనే టెండర్లు తెరవనున్నట్లు వివరించారు. చిన్నాపురం వంతెన నిర్మాణానికి కూడా టెండరు ప్రక్రియ పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. చంద్రన్న బాటలో భాగంగా రూ.3.80కోట్లతో 60 గ్రామీణ రహదారులను సిసి రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నీరు-చెట్టు పథకం కింద రూ.1.27కోట్లతో 40 మైనర్ డ్రైన్స్, చెరువుల మరమ్మతు పనులు చేశామన్నారు. రూ.4కోట్లతో రెండు తుఫాన్ షెల్టర్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 17వేల 540 మంది రైతులకు రూ.25కోట్ల రుణాలు, గ్రూప్ లోన్స్ కింద 1460 మందికి రూ.2.43కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఫాం మెకనైజేషన్ కింద మండలంలో రెండు హార్వెస్టర్లు, 120 ఆయిల్ ఇంజన్లు, 20 తైవాన్ స్పేయర్లు అందించామన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ వద్ద అత్యంత సామర్ధ్యం గల మోటార్లను ఏర్పాటు చేసి కాలువల ద్వారా వస్తున్న నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో 3.17మీటర్లు, పంపుల చెరువులో 8.5మీటర్ల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. మరో 15 రోజుల్లో మూడు టియంసిల నీరు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. పుష్కరాల్లో భాగంగానే మచిలీపట్నం మున్సిపాల్టీలో రూ.11.57కోట్లతో రహదారులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే అన్ని రహదారులకు సెంటర్ డివైడింగ్‌తో పాటు ఫుట్‌పాత్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి నాయకుడు గోపిచంద్, కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, నారగాని ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.