కృష్ణ

ప్రత్యేక హోదా కాకున్నా.. ప్రత్యేక సహకారమందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, మే 7: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకపోయినా, ప్రత్యేక సహకారాన్ని ఆశిస్తున్నామని, ప్రధాని నరేంద్రమోదీని నమ్ముకున్నామని బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ స్వగృహంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు విభజనను కాంక్షించలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ అసంపూర్ణ విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదని, రెవెన్యూలోటు, రాజధాని, పోలవరం నిర్మాణం వంటివి చేపట్టాల్సిన అవసరం ఉందని, ఉద్యోగావకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు. నాడు విభజన బిల్లు ఆమోదించే సమయంలో ప్రత్యేక హోదాను డిమాండు చేసిన భారతీయ జనతాపార్టీ నేడు మాటమార్చడం విచారించదగిన విషయమన్నారు. నాడు కావాలని-నేడు లేదనడం సమంజసం కాదని, ప్రత్యేక హోదా లేక పోయినా-ప్రత్యేక సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రంతో విభేదాలను ప్రతిపక్ష వైకాపా కోరుకుంటోందని, ఇప్పటి వరకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందించిందని, విభేదాలు సృష్టించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అన్యోన్యమైన తన కాపురంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమర్ధత మీద నమ్మకం ఉన్నదని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్భ్రావృద్ధి కోసం ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. సంప్రదింపుల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన వెల్లడించారు. సమావేశంలో శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, కౌన్సిలర్ ఖుద్దూస్, పార్టీ నాయకులు చేదుర్తిపాటి ప్రవీణ్, కొండా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.