కృష్ణ

అగ్నిగుండంలా జిల్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 25: రోహిణీ కార్తె ప్రభావంతో జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతోంది. ముఖ్య పట్టణాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పులు కురిపిస్తున్న సూరీడు ధాటికి జిల్లావాసులు తాళలేకపోతున్నారు. మండే ఎండలకు రోడ్ల మీదకు రాలేక, వడగాడ్పులకు ఇంట్లో ఉండలేక నానాఅవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు భీతిల్లుతున్నారు. వృద్ధులు, చిన్నారులను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాడ్పుల మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 30 మంది వరకు వడగాడ్పులకు మృతి చెందినట్లు అనధికార వర్గాల సమాచారం. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బుధవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 6గంటల నుండే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రి 10గంటలు దాటినా వడగాడ్పులు ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో సముద్ర తీరప్రాంతాల్లో సాయంత్రం పూట వడగాడ్పులు తగ్గి చల్లటి వాతావరణం ఏర్పడేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. సముద్రానికి అనుకున్న గ్రామాల్లో సైతం వడగాడ్పులు ఏమాత్రం తగ్గడం లేదు. భగభగ మండుతున్న ఎండలకు తాళలేక ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రధాన రహదార్లతో పాటు జాతీయ రహదార్లు సైతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వర్తక, వాణిజ్య సంస్థలు కూడా ఉదయం 11గంటల నుండి మూతబడుతున్నాయి.

ఆక్వా రంగం అతలాకులతలం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 25: అధిక ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవటంతో ఆక్సిజన్ అందక ఆక్వా రంగం అతలాకుతల మవుతోంది. జిల్లాలో భారీగా సాగు చేసిన వనామీ రొయ్యలు ఆక్సిజన్ అందక మృత్యువాత పడటంతో చెరువులు ఖాళీ అవుతున్నారు. గత నాలుగు రోజులుగా ఉక్కపోతతో కూడిన ఉష్ణోగ్రతలకు భారీగా రొయ్యలు మృత్యువాత పడటంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. అధిక వ్యయం చేసి రాత్రీ పగలు తేడాలేకుండా రొయ్యలను బతికించుకునేందుకు ఏరియేటర్లను తిప్పుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటే మరో పదిరోజుల్లో జిల్లాలోని చెరువులన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కేవలం 50 కౌంట్ నుండి 100 కౌంట్ వరకు ఉన్న రొయ్యలు మృత్యువాత పడటంతో రైతులు దిగాలు పడుతున్నారు. తక్కువ కౌంట్ ఉన్న రొయ్యలను సైతం పట్టుబడి చేసి అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కారణంగా ఆక్సిజన్ అందకపోవటంతో భారీ సంఖ్యలో రొయ్యలతో పాటు చేపలు కూడా మృత్యువాత పడటంతో చెరువులను హుటాహుటిన ఖాళీ చేస్తున్నారు. ముఖ్యంగా నీటి సమస్యతో అతలాకుతలమవుతున్న చేపల సాగుకు అధిక ఉష్ణోగ్రతలు తోడవటంతో ఆక్సిజన్ అందక చేపలు కూడా మృత్యువాత పడుతుండటంతో పెంపకందారులు గగ్గోలు పెడుతున్నారు. మేత, కూలి ఖర్చులతో పాటు ఆక్సిజన్ పెంచేందుకు వాడిన మందులు, తదితరాల ఖర్చులు తడిసి మోపెడయ్యాయని వాపోతున్నారు. ఏదిఏమైనా ఉక్కపోతతో కూడిన ఉష్ణోగ్రతలు ఆక్వా రంగాన్ని గడగడలాడిస్తున్నాయి.

భార్యతో విభేదించి
పీక కోసుకుని భర్త ఆత్మహత్య
విజయవాడ (క్రైం), మే 25: భార్యతో విభేదించి ఒంటరిగా ఉంటున్న వ్యక్తి జీవితంపై విరక్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతూ తట్టుకోలేక ఈఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా చెవుటూరుకు చెందిన దుత్తలూరి సిద్ధయ్య (30) గత కొంతకాలంగా కృష్ణలంక మలేరియా ఆస్పత్రి వద్ద నివాసముంటున్నాడు. ముఠాపని చేస్తూ జీవిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. కాపురంలో తలెత్తిన విబేదాల నేపధ్యంలో భార్య సిద్ధయ్యను వదిలి కొద్దిరోజుల క్రితం వెళ్లిపోయింది. భార్యకు దూరంగా ఉంటున్న ఇతను తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యపాలయ్యాడు. ఈదశలో జీవితంపై విరక్తి కలిగి చనిపోవాలనుకున్నాడు. దీంతో మంగళవారం పీకతో గొంతు కోసుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉండగా.. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధి
పటమట, మే 25: రాష్ట్రంలో మహిళలు ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. బుధవారం ఉదయం 22వ డివిజన్ నెహ్రునగర్ కళ్యాణమండపంలో జరిగిన డ్వాక్రా రుణాల పంపిణీ కార్యక్రమానికి గద్దెతోపాటు, మేయర్ కోనేరు శ్రీ్ధర్ పాల్గొని 22 గ్రూపులకు 1.5 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ పురుషులకు రుణాలు ఇస్తే జల్సాలు చేస్తారని, అందుకే మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని పది మందికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పల్లెం రవికుమార్, గొరిపర్తి నరసింహారావు, సిద్దెం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.