కృష్ణ

‘మహానాడు’ను జయప్రదం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 25: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే మహానాడుకు జిల్లా నుండి సుమారు 5వేల మందికి పైబడి తరలి వెళ్లనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడులో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుండి జిల్లాలోని పార్టీ శ్రేణులకు సుమారు 4500 ఆహ్వానాలు అందాయన్నారు. మరికొంత మందికి ఆహ్వానాలు గురువారం నాటికి రానున్నట్లు చెప్పారు. అలాగే 3వేలు విఐపి వెహికల్ పాస్‌లు వచ్చాయన్నారు. వీటిని నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యులకు అందచేసినట్లు చెప్పారు. మహానాడుకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు విధిగా పార్టీ సభ్యత్వ కార్డును తీసుకురావాలని ఆయన తెలిపారు. సభ్యత్వ కార్డులు ఎన్‌రోల్ చేసిన తర్వాత మాత్రమే వారికి మహానాడు వేదిక వద్దకు అనుమతిస్తారన్నారు. ఈవిషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. మూడు రోజులు జరిగే మహానాడులో జిల్లాలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి దిగజారుడు రాజకీయాలపై చర్చ జరుగుతుందన్నారు. తెలుగుదేశం జాతీయ పార్టీగా అవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న మహానాడుకు ఆరు రాష్ట్రాల నుండి పార్టీ శ్రేణులు తరలి రానున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. దిశా, దశ లేని నాయకుడు జగన్ అన్నారు. తన సొంత నాయకుల్ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారని అర్జునుడు ధ్వజమెత్తారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, పార్టీ నాయకులు ఇలియాస్ పాషా, షేక్ వౌలాలి పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ బాబు ఎకు ప్రశంసల జల్లు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 25: నాడిక్కడ జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే ప్రశంసలు అందుకున్న ఏకైక కలెక్టర్ కృష్ణా కలెక్టర్ బాబు ఎ. పైగా ఇ - ఆఫీసు విధానంపై కలెక్టర్ బాబు ఎకు మాట్లాడే అవకాశం కూడా లభించింది. వీరు రూపొందించిన జన్‌ధన్, ఆధార్, మొబైల్ యాప్ నేడు భారతదేశానికే తలమానికంగా మారుతుండటం చాలా గొప్ప విశేషంగా సిఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ విధానం ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, ఎరువులు పంపిణీలోనూ, పింఛన్‌లు పంపిణీలోనూ అమలవుతున్నదన్నారు.