కృష్ణ

ఎన్‌డిఎ పాలనపై నేటి నుండి విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: కేంద్రంలో ఎన్టీఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలపై ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు 20 రోజులపాటు ప్రచారం జరుపనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. బుధవారం నాడిక్కడ జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి కేంద్ర ప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవాలను ఏ విధంగా నిర్వహించాలో నేతలకు దిశ,దశ నిర్దేశం చేశారు. పలువురు కేంద్ర మంత్రులతో విశాఖ, విజయవాడ, కాకినాడు, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో భారీ ఎత్తున సభలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఒక్కో బృందంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు జాతీయ, రాష్ట్రీయ నాయకులు ఉంటారు. ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల తగిన బిల్లులు, దీని వల్ల అభివృద్ధికి కలుగుతున్న అడ్డంకులు. గత ప్రభుత్వాల నుంచి ఎదురైన సమస్యలు, ఇబ్బందులను అధిగమించి ఎన్టీఎ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాల్సి ఉంది. అలాగే ఈ బృందం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమవేశాలు నిర్వహించి వారికి కల్గిన ప్రయోజనాలు తెలుసుకుని ప్రజలకు వివరించాలి. సమాజంలోని వివిధ సంస్థలు, విద్యావేత్తలు, వృత్తినిపుణులు, మేధావులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా సమాజంలోని అన్ని వర్గాలతో రాజకీయేతర సమావేశాలు నిర్వహించి దృశ్యరూపంలో వివరించాలి. ఆయా ప్రాంతాల్లో పార్టీ బలాన్నిబట్టి బహిరంగ సభ లేదా పార్టీ సభ్యులతో సమావేశం మీడియాకు ఇంటర్వ్యూలు. మహిళలు, యువత, రైతులు, కార్మికులు, దళితులు ఇలా రంగాల వారీగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇక లోక్‌సభ సభ్యులు, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం రెండు రోజులపాటు ఉండేలా షెడ్యూలు తయారు చేసుకోవాలి. కనీసం రెండు పగళ్లు, ఒక రాత్రి సబ చేయాలి. ఇక పార్టీపరంగా డివిజన్‌లు, మండలాలు వారీగా సమ్మేళనలు నిర్వహించి ప్రభుత్వ విజయాలు వివరించాలి. వీటికి సంబంధించిన బ్రోచర్ల పుస్తకాలు ఇతర సాహిత్యాన్ని పంపిణీ చేయాలి. కేబుల్ టివి ఛానళ్లను పత్రికలను ఉపయోగించుకోవాల్సి ఉందని హరిబాబు గట్టిగా చెప్పారు. రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్క మండలాన్ని సందర్శించి గ్రామస్తులతో సత్‌సంబంధాలు ఏర్పరచుకుని రాత్రులు అక్కడ బస చేయాలన్నారు. నేటి సమావేశంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి జి రవీంద్రబాబు, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, ఎంపి గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రావి భూపాల్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, అయ్యాజీనామ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జమ్ముల శ్యాంకిషోర్, సురేష్‌రెడ్డి తదితరులున్నారు.