కృష్ణ

దుకాణ విషయమై చల్లపల్లిలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, మే 28: ఓ షాపు విషయమై లీజు దారునికి, సబ్ లీజు దారునికి మధ్య తలెత్తిన వివాదంతో శనివారం తెల్లవారు జాము నుండి చల్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ప్రధాన సెంటరులో రాజాగారికోట పక్కన ఉన్న షాపు విషయమై ఇరువురి మధ్య తలెత్తిన వివాదం రెండు సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంతో సబ్ డివిజన్‌లోని పోలీసులతో పాటు క్విక్ యాక్షన్ టీమ్ రంగ ప్రవేశం చేయగా వ్యవహారం డిఎస్పీ కార్యాలయానికి చేరింది. ఈ దశలో ఎస్టేట్ జోక్యం జోక్యం చేసుకుని సదరు షాపును స్వాధీన పర్చుకోవడంతో ఉత్కంఠతకు తెరపడింది. శనివారం తెల్లవారుజాము నుండి తీవ్ర ఉద్రిక్తతను, ఉత్కంఠను కలిగించిన ఈ వ్యవహారంపై పూర్వపరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్రధాన సెంటరులో జమిందారి ఎస్టేట్‌కు చెందిన స్థలాన్ని అన్నవరపు శివకుమార్ అద్దెకు తీసుకుని షాపు నిర్మించుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన షేక్ బాజీగోరికి శివకుమార్ షాపును సబ్ లీజుకు ఇచ్చాడు. సబ్ లీజుకు తీసుకున్న బాజీగోరి సదరు షాపులో రెడిమెడ్ వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. షాపు ఖాళీ చేసే విషయమై ఇరువురి మధ్య నెలకొన్న వివాదం కోర్టుకు వెళ్ళింది. ఈ దశలో షాపు యజమాని శివకుమార్ తన మద్దతు దారులతో కలిసి అర్ధరాత్రి వేళ షాపు తాళాలు బద్దలు కొట్టి అందులో ఉన్న రెడిమేడ్ దుస్తులను ఖాళీ చేసి వెను వెంటనే కిరాణా షాపు ఏర్పాటు చేసి పాత బోర్డును మార్చివేశాడు. ఉదయానే్న వచ్చి చూసిన రెడీమేడ్ దుకాణ యజమాని బాజీగోరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదైంది. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాజీగోరి తన మద్దతు దారులతో పాటు మహిళలు, పిల్లలతో వచ్చి సదరు షాపు తాళాలు పగులగొట్టి అందులోని శివకుమార్‌కు చెందిన కిరాణా సరుకులు తొలగించి తిరిగి రెడిమేడ్ వస్త్ర దుకాణంగా మార్చాడు. విషయం తెలిసి శివకుమార్ అతని వర్గీయులు, మహిళలతో సహా అక్కడకు చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సిఐ వైవి రమణ, ఎస్‌ఐ మణికుమార్‌లు హుటాహుటిన తమ సిబ్బందితో కలిసి షాపు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఒక దశలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున మోహరించడంతో అవనిగడ్డ ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు డిఎస్పీ సయ్యద్ ఖాదర్ భాషా ఆదేశాలతో సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందిని, మచిలీపట్నం నుండి క్విక్ యాక్షన్ టీంను చల్లపల్లి రప్పించి పరిస్థితి అదుపుతప్పకుండా బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ ఇరువర్గాలు షాపు వద్ద నుండి కదలకపోవడంతో డిఎస్పీ కార్యాలయంలో ఇరువర్గాలకు చెందిన పెద్దలతో చర్చలు జరిపారు. వ్యవహారం కోర్టులో ఉన్నందున శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని డిఎస్పీ ఖాదర్ భాషా సూచించారు. చర్చలు జరుగుతుండగా ఎస్టేట్ ప్రతినిధి రామ్మోహనరావు షాపు వద్దకు చేరుకుని ఎస్టేట్‌కు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని సబ్ లీజుకు ఇవ్వటం ఎస్టేట్ నిబంధనలకు విరుద్దమని ఇరువర్గాలను బయటకు పంపించి షాపు తాళాలు వేసి స్వాధీనం చేసుకోవటంతో ఉత్కంఠకు తెరపడింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న దృష్ట్య తహశీల్దార్ కె స్వర్ణమేరి 144సెక్షన్ విధించారు. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మట్టి మాఫియాపై త్వరలో వైకాపా పోరుబాట

హనుమాన్ జంక్షన్, మే 28: భూగర్భ జలాల పరిరక్షణ పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న మట్టి మాఫియాపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుందని జిల్లా వైకాపా అధ్యక్షుడు కొలుసు పార్ధసారథి ప్రకటించారు. శనివారం గన్నవరం నియోజకవర్గ పార్టీ కన్వీనర్ డా దుట్టా రామచంద్రరావు నివాసంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో పార్ధసారథి తెలుగుదేశం నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కుడి కాలువ పనులలో భాగంగా తవ్విన మట్టిని తెదేపా ప్రజా ప్రతినిధులు, నాయకులు అమ్ముకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నీరు - చెట్టు, చెరువుల అధునికీకరణ పనులలో అవినీతి ఏరులైపారుతోందని ధ్వజమెత్తారు. 15 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వినట్లు చెప్పిన నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వానికి చెస్ చెల్లించడం ద్వారా వచ్చిన ఆదాయంపై శే్వతపత్రం విడుదల చేయాలని అన్నారు. మట్టి తవ్వకాలలో 600 కోట్ల అవినీతి జరిగిందని, గన్నవరం నియోజకవర్గ పరిధిలో జరిగిన మట్టి మాఫియాపై ఆందోళన చేపడతామని చెప్పారు. హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర చేస్తామని, పాదయాత్ర తేదీలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.