కృష్ణ

సారా అదుపుతో పెరిగిన మద్యం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 28: వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన దాడుల కారణంగా కృష్ణాజిల్లా సారా రహిత జిల్లాగా గుర్తింపు పొందిందని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎస్ వెంకట శివప్రసాద్ పేర్కొన్నారు. మొవ్వ సర్కిల్ స్టేషన్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవోదయం’ కార్యక్రమం ద్వారా కాపు సారా అడ్డాలుగా ఉన్న జగ్గయ్యపేట, తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు, బంటుమిల్లి సర్కిల్స్ పరిధిలోని గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు, ఇరిగేషన్ శాఖాధికారుల సహకారంతో గత ఏడాది ఆగస్టు నుండి నిరంతరం కొనసాగించిన దాడుల వల్ల ఆయా గ్రామాలలో 99శాతం కాపు సారాను అదుపుచేసినట్లు తెలిపారు. కేవలం రికార్డులకే పరిమితం కాకుండా బెల్లం ఊటను ధ్వంసం చేసే విధానాలను ఎప్పటికప్పుడు నెట్ ద్వారా ఉన్నతాధికారులకు ప్రత్యక్షంగా చూపించినట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలోని జగ్గయ్యపేటలో 280శాతం, తిరువూరులో 130 శాతం, విస్సన్నపేట 202, నూజివీడు 145, బంటుమిల్లి 106 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. అందువల్ల రాష్ట్రంలోని ఇతర జిల్లాల కన్నా కృష్ణా జిల్లాలో 10 శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లు తెలిపారు. జిల్లాలోని 20 సర్కిల్స్ పరిధిలోని 10 సర్కిల్స్‌లో తమ శాఖ తీసుకున్న చర్యలు కారణంగా కాపుసారా తగ్గిందన్నారు. గత ఏడాది మే నెలలో జిల్లాలో రూ.391 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. ఈ ఏడాది 27 శాతం అమ్మకాలు తగ్గటంతో అందుకు కారణాలు విశే్లషించి సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని హెచ్చరించటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే మొవ్వ సర్కిల్ పరిధిలో లూజు అమ్మకాలు, ఎంఆర్‌పి కన్నా అదనపు అమ్మకాలను అదుపు చేసి బెల్టు షాపులను రద్దుపర్చి సమయపాలన అమలుపర్చే విధంగా అధికారులతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొవ్వ సిఐ ఎం సూర్యప్రకాష్‌పై ఏసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్కిల్ పరిధిలోని దుకాణాలలో లూజు అమ్మకాలు, బెల్టు షాపులను అదుపు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంటు ఎం సునీత తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలనలో అన్నీ హామీలే

విజయవాడ, మే 28: కేంద్రంలో ఈ రెండేళ్ల బిజెపి పాలనలో హామీలు తప్ప అభివృద్ధి రేటు శూన్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ నిశితంగా విమర్శించారు. ఈ రెండేళ్లలో అభివృద్ధి 5 శాతానికి మించలేదని, అయితే 7.5 శాతం సాధించినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం సిటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదన్నారు. పేదలు మరింత పేదలయ్యారని, పనులు లేక వలసలు పోతున్నారని తెలిపారు. స్వచ్ఛ్భారత్ అంటూ నిధులు దారిమళ్లిస్తున్నారని, ప్రధాని మోదీ నేతృత్వం వహించే వారణాసి దేశంలోకెల్లా అతి పెద్ద చెత్తనగరంగా తయారైందని దుయ్యబట్టారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. ఆధార్‌కార్డుల పేరుతో ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చత్తీస్‌ఘడ్ స్కామ్, గుజరాత్ పెట్రో స్కామ్‌పై, పనామా కేసులపై విచారణ లేదని, సిబిఐ దర్యాప్తు సంస్థను మోదీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా యూనివర్శిటీల్లో బిజెపి, సంఘ్ పరివార్ శక్తులు వర్గ విభేదాలు సృష్టించాయని, మంత్రి స్మృతి ఇరానీ దళిత విద్యార్థుల పట్ల అవహేళనగా మాట్లాడి వివక్ష ప్రదర్శించారని విమర్శించారు. సుబ్రహ్మణ్య స్వామి విద్యార్థుల్ని కుక్కలతో పోల్చాడని, అంబేద్కర్ తమవాడంటూ స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రెండేళ్లల్లో ప్రచారార్భాటం తప్ప బిజెపి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. సామాన్య, పేద వర్గాలకు ఉపాధి లేక యువత నిస్తేజంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు.