కృష్ణ

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 28: పుష్కర పనుల్లో సాకులు చూపి పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుండి శనివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ఆయన కృష్ణలంక బైపాస్ రోడ్డు పనులతోపాటు సీతమ్మ పాదాల నుండి బెరమ్‌పార్క్ వరకు జరుగుతున్న పుష్కర ఘాట్ల పనులను ఇంజనీర్లు, సోమా ప్రతినిధులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం పనులు జరగకపోవడం వల్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పరస్పరం చర్పించుకుని పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పనుల నిర్వహణలో సమస్యలు ఏమైన తలెత్తితే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని సమస్య త్వరితగతిన పరిష్కరిస్తానన్నారు. షిప్టుల ప్రకారం 24 గంటలు పనివారలను నియమించి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయాలని సోమా ప్రాజెక్టు మేనేజర్ సతీష్‌ను ఆయన ఆదేశించారు. నాలుగు రోజులుగా ఆయన పుష్కర ఘాట్లను అర్ధరాత్రులు తనిఖీలు నిర్వహించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. అర్ధరాత్రి తనిఖీలో భాగంగా విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్ డా సుజనా, లక్ష్మిశాలతో పాటు బందరు, గుడివాడ ఆర్‌డివోలు పి సాయిబాబా, డి చక్రపాణిలతో కలెక్టర్ ఫోను కాన్ఫరెన్స్ నిర్వహించి సిమెంట్, కాంక్రిట్ లారీలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలుత కలెక్టర్ కృష్ణలంక ఫైర్‌స్టేషన్ వద్ద జరుగుతున్న సబ్‌వే (అండర్ వెహికల్ పాస్) పనులను పరిశీలించారు. సబ్‌వే కోసం నిర్మిస్తున్న పనులను మొదటి, రెండవ దశలో జరుగుతున్న తీరును సోమా ప్రతినిధుల నుండి అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి బయలుదేరి సీతమ్మపాదాల వద్ద నమూనా వేర్లాజ్ ఘాట్ పనులను పరిశీలించారు. పుష్కరఘాట్ల నిర్మాణానికి గాను కడప నుండి తెచ్చిన నమూనా వేర్లాజ్ టైల్స్‌ను పరిశీలించి వాటి నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు గల టైల్స్‌ను మాత్రమే వినియోగించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పుష్కర ఘాట్ల నిర్మాణ క్రమంలో ఎక్కడైనా నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఘాట్ వద్ద అండర్ గ్రౌండ్ విద్యుత్ లైను పనులను త్వరితగతిన చేపట్టాలని ట్రాన్స్‌కో ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. సీతమ్మపాదాలు, కృష్ణలంక బైపాస్ వద్ద వాటర్ లీకేజీ పట్ల కార్పొరేషన్ అధికారులను ఆయన తగు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న చోట్ల కార్పొరేషన్ అధికారులు లేకపోవడాన్ని గుర్తించి తగు సంజాయిషీ ఇవ్వాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పనుల్లో నిర్లక్ష్యం సహించను..

శరవేగంగా పోలవరం పనులు

జి.కొండూరు, మే 28: పోలవరం కుడి ప్రధాన కాలువపై మండల పరిధిలోని వెలగలేరు వద్ద విజయవాడ - విస్సన్నపేట మార్గంలో డబుల్ లైన్ వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం కాలువను, వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు డిఇ అప్పారెడ్డి పర్యవేక్షణలో మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. జూన్ 15 నాటికి పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో మండుటెండల్లో సైతం పనులు చురుగ్గా చేస్తున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని కృష్ణానదికి మళ్ళించడానికి ఇదివరకూ వెలగలేరులోని భలేరాయుడు చెరువులో నుంచి కాలువను అనుసంధానం చేశారు. దీని వల్ల భలేరాయుడు చెరువు కింద ఆయకట్టుకు సాగునీరు అందించడానికి చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడేవి. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా, భలేరాయుడు చెరువు కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా అందించాలనే లక్ష్యంతో పోలవరం కాలువ ఎలైన్‌మెంట్‌లో కొద్దిపాటి మార్పు చేశారు. చెరువు పక్కగుండా విడిగా 73.25 మీటర్ల వెడల్పుతో కాలువను తవ్వుతున్నారు. ఇప్పటికి 85 శాతం కాలువ పనులు పూర్తయ్యాయి. దీనివల్ల పోలవరం కాలువ ద్వారా భలేరాయుడు చెరువుతో సంబంధం లేకుండా పట్టిసీమ నీళ్ళు నేరుగా కృష్ణానదికి చేరుతాయి. పట్టిసీమ ద్వారా 8,500, మధ్యలో కాలువల ద్వారా 3,000 క్యూసెక్కుల నీళ్ళు ప్రవహిస్తాయని డిఇ అప్పారెడ్డి తెలిపారు. చేగిరెడ్డిపాడు వైపు నుంచి భలేరాయుడు చెరువుకు బుడమేరు నీటిని మళ్ళించడానికి పోలవరం ఆర్‌ఎమ్‌సి కింద అండర్ టనె్నల్ (యుటి) నిర్మించనున్నారు. రైతుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయి. మిగిలి ఉన్న పోలవరం కాలువను పూర్తి చేయడానికి మరో 43 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎకరానికి రూ.40 లక్షల వరకూ నష్టపరిహారం ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చెప్పం... చేసి చూపిస్తాం
పాతబస్తీ, మే 28: విజయవాడ రాజధానిగా మున్ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాటన్నింటినీ ఎలా ఎదుర్కొంటామో ముందుగా చెప్పం చేసి చూపిస్తామని సిపి అన్నారు. పాతబస్తీలోని వస్తల్రతలో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ప్రారంభించిన అనంతరం నగర సిపి విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం అభివృద్ధి పనులు ప్రస్తావించారు. మంత్రుల పర్యటనలు, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు, చైన్‌స్నాచింగ్, బ్లేడు బ్యాచ్ ఆగడాలు, నేరాల నియంత్రణ, పోలీసుల నిరంతర పరుగులు తదితర అంశాలపై విలేఖర్లు ప్రశ్నించగా ఆయన అన్నింటికీ ఒకే సమాధానంగా చెప్పం చేసి చూపిస్తామని ఎంతో ధీమాగా, తమ సిబ్బందిపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సిబ్బంది తగినంత లేకపోయినాగాని శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తామన్నారు. సిపి పాతబస్తీకి రాక సందర్భంగా వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఎసిపి సూర్యచంద్రరావు, ఆర్‌ఎస్‌ఇ రేలంగి రాజేంద్రప్రసాద్‌లు ట్రాఫిక్‌ని నియంత్రించారు. ఎస్‌బి ఎసిపి ఎస్ రమేష్‌బాబు సిపి కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు.

తుమ్మలపాలెం ఘాట్ విస్తరణకు రైతులు ముందుకురావాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 28: తుమ్మలపాలెం ఘాట్ విస్తరణ, ఆ ప్రాంత అభివృద్ధిలో రైతులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ తుమ్మలపాలెం రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలలో యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిఎం చంద్రబాబు ఘట్ నిర్మాణం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చిన్న, చిన్న ఘాట్లను ఒక్కటిగా చేసి యాత్రికులకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. పుష్కరాలు అనంతరం పరిసర ప్రాంతాల్లో టూరిజం హబ్‌గా తీర్చిదిద్ది అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి అవసరమైన భూమిని రైతులు అందించి ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా జి సృజన, ఇబ్రహీంపట్నం తహశీల్దార్ పి జయశ్రీ, రైతులు పాల్గొన్నారు.