కృష్ణ

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 19: పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం బందరు మండలంలో రూ.4.24 కోట్ల అంచనా వ్యయంతో రెండు తుఫాన్ షెల్టర్ల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. మంగినపూడి గ్రామంలో రూ.2.11 కోట్ల అంచనా వ్యయంతో, గరాలదిబ్బ గ్రామంలో రూ.2.13 లక్షల వ్యయంతో నిర్మించనున్న బహుళ ప్రయోజన తుఫాను రక్షిత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ తుఫాన్‌లు, వరదల సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో జరిగే కార్యక్రమాల నిర్వహణకు కూడా షెల్టర్లు ఉపయోగపడతాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తుఫాన్ తాకిడికి గురయ్యే తీరప్రాంత గ్రామాల్లో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న తుఫాన్ షెల్టర్లను పటిష్ఠంగా నిర్మించాలన్నారు. వీటిని కేవలం తుఫాన్ సమయంలోనే కాకుండా పాఠశాలలుగా, సమావేశాలు, ఫంక్షన్లు, తదితర అవసరాలకు వినియోగపడేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో మంత్రి రవీంద్ర పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల పార్టీ నాయకులు తలారి సోమశేఖర్, కుంచె నాని, ఎం వేణుబాబు, రాజులపాటి సత్యనారాయణ, ఎన్ అచ్యుతరామయ్య పాల్గొన్నారు.

డ్రైనేజీ సమస్యను పరిష్కరిద్దాం
* నిపుణులతో మంత్రి రవీంద్ర భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జూన్ 19: పట్టణంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొందామని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, నిపుణులతో ఆదివారం ఆయన ఇక్కడ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ‘్ఛలెంజస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ సర్ఫేస్ డ్రైనేజీ సిస్టం ఆఫ్ మచిలీపట్నం’ అనే అంశంపై రెండు రోజులుగా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆచార్యుల బృందం ఉప కులపతి రామకృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో మంత్రిని కలిశారు. వర్క్‌షాప్ వివరాలు, క్షేత్ర పర్యటనలో పరిశీలించిన సమస్యలను మంత్రికి వివరించారు. అధిక వర్షాలకు పట్టణం జలమయం కావడం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, డ్రైన్ల అనుసంధానం, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మున్సిపల్ అధికారులు పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ తీరుతెన్నులు మ్యాప్‌లతో సహాయ సమగ్ర సమాచారాన్ని ఉప కులపతి ద్వారా నిపుణులకు అందజేయాలని మంత్రి ఆదేశించారు. శివగంగ, తాళ్ళపాలెం, బందరుకోటలో మేజర్ డ్రైన్లు ఉన్నాయని, రహదారులు జలమయం కావడం, డ్రైనేజీ ద్వారా నీటి ప్రవాహం సరిగా లేకపోవటంతో పంపుహౌస్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాస్ర్తియంగా అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని మంత్రి విసి రామకృష్ణారావును కోరారు. ఈ సమావేశంలో వర్క్‌షాప్ సమన్వయకర్త డా. పివి బ్రహ్మాచారి, రూర్కి ఐఐటి ఆచార్యులు ఆశిష్ పాండే, ఉమేష్‌చంద్ర చౌబే, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు బాలప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఉపాధ్యక్షులు ఆచార్య పి విజయప్రకాష్ పాల్గొన్నారు.

మురుగునీటి సమస్యపై..
ఘర్షణలో వ్యక్తి మృతి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 19: మురుగు నీటి పారుదల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం స్థానిక వైఎస్‌ఆర్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న లంకే నాగేశ్వరరావు ఇంట్లోని మురుగు నీటిని బయటకు పంపించే విషయమై పక్కనే నివాసం ఉంటున్న కాకర్ల చంద్రరావుతో గతంలో గొడవలు జరిగాయి. ఈనేపథ్యంలో నాగేశ్వరరావుపై మురుగునీటి సంఘం అధ్యక్షుడు బచ్చుల కృష్ణకు చంద్రరావు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం మున్సిపల్ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి నీటి మళ్లింపును పరిశీలిస్తుండగా నాగేశ్వరరావు, చంద్రరావు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో చంద్రరావు గొడుగుతో పొడిచి కొట్టడంతో నాగేశ్వరరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ నాగేశ్వరరావు మృతి చెందాడు. సిఐ వరప్రసాద్, ఎస్‌ఐ బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.