కృష్ణ

రజక, నారుూబ్రాహ్మణులకు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 28: రజక, నారుూబ్రాహ్మణులకు బ్యాంకుల ద్వా రా రుణాలు మంజూరు జరిగే విధంగా బ్యాంకర్లతో మాట్లాడటం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రు డు అన్నారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రజ క, నారుూబ్రాహ్మణ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులతో శనివారం జాయింట్ కలెక్టర్ గంధం చం ద్రుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మా ట్లాడుతూ రజక, నారుూ బ్రాహ్మణులకు వ్యక్తిగత రుణాలతోపాటు, వ్యాపారపరంగా యూనిట్లు నెలకొల్పుకునేందుకు రుణాలను మంజూరుచేసే విధం గా కృషిచేస్తానని జాయింట్ కలెక్టర్ అన్నారు. రజక, నారుూ బ్రాహ్మణుల జీవనోపాధికి కనీస మొత్తంలో రుణా లు మంజూరయ్యే విధంగా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడి చర్చిస్తానన్నా రు. గూడూరు, కలిదిండి, మోపిదేవి మండలాల్లో మంజూరై ఇంకనూ నిర్మాణాలు చేపట్టని దోభీఘాట్లను సత్వరమే పూర్తిచేసేలా సంబంధిత ఎంపిడివోలకు ఆదేశాలు జారీచేయాలని జడ్ పి సిఇవోను ఆదేశించారు. వివిధ శాఖ ల్లో రజక, నారుూబ్రాహ్మణుల వృత్తు ల్లో ప్రత్యేకంగా వారికే కేటాయించిన ఉద్యోగాల్లో సంబంధిత వర్గాలకే చెం దేలా అన్ని శాఖలకు నోటీసులు ఇవ్వాలని బిసి సంక్షేమ శాఖ అధికారికి సూ చించారు. రజక వృత్తి చేసుకునే రజకులకు బొగ్గు కొనుగోలు చేసి స్టోరేజ్ పా యింట్‌కు స్థలం కేటాయించాలని, అ న్ని నియోజకవర్గాల్లో రజకులకు కర్మల భవన్ నిర్మించాలని ఆయా వర్గాల ప్రతినిధులు జెసి దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తానన్నారు. రజక, నారుూ బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను జిల్లా ఎస్‌పితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ నాగార్జునసాగర్, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, బిసి సంక్షేమశా ఖ అధికారిణి పుష్పలత, రజక, నారుూ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
యువజనోత్సవ పోటీల్లో
పాలిటెక్నిక్ విద్యార్థుల విజయకేతనం
గుడ్లవల్లేరు, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం గుడివాడలో నిర్వహించిన డివిజన్ స్థాయి పోటీల్లో స్థానిక గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. యువతలో సాంస్కృతిక కళలను పెంపొందించేందుకు నిర్వహించిన పోటీల్లో సుమారు 30 సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. కూచిపూడి నృత్యంలో పి యశస్విని ప్రథమ స్థానం, హిందుస్థానీ గాత్రంలో పిఎల్‌ఎస్ వైష్ణవి ప్రథమ స్థానం, కె నాగదివ్య, టి వనజ, ఇఎన్‌డి కీర్తి, బేబి మృదుల, మాధురి గ్రూపు జానపద గీతంలో ప్రథమ స్థానం, ఏకపాత్రాభినయంలో హితేష్, కె వౌనిక ప్రథమ, ద్వితీయ స్థానాలు, ఎలక్యూషన్ తెలుగులో ఎ మాధవి, పి విజయశ్రీ ప్రథమ, ద్వితీయ స్థానాలు, ఎలక్యూషన్ ఇంగ్లీష్‌లో ఎస్ రాజేష్‌రెడ్డి ద్వితీయ స్థానం, పెయింటింగ్‌లో కె మాధురి ద్వితీయ స్థానంలో నిలిచారు. డిసెంబర్ 14న విజయవాడలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొనున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్ వి రామాంజనేయులు తెలిపారు.

చింతమనేని దిష్టిబొమ్మ దగ్ధం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 28: ప్రభుత్వ విప్, దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమేని ప్రభాకర్ వ్యాఖ్యలపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను చింతమనేని అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కోనేరు సెంటరులో చింతమనేని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తొలుత పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రజీనారాణి మాట్లాడుతూ మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చౌటపల్లి రవి, వివి రమణారావు, బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు, తమ్ము కిషోర్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి, కళ్యాణ కుమారి, ఎ రమాదేవి, రూరల్ ప్రాజెక్టు అధ్యక్షురాలు నాంచారమ్మ పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
బంటుమిల్లి : వేతన పెంపు జీవోను విడుదల చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న ఆందోళనలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చర్యలకు నిరసనగా శనివారం బంటుమిల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాజేటి శ్రీనివాసరావు, ధనశ్రీ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు నాగమణి, వరలక్ష్మి, సుబ్రహ్మణ్యేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో నాలుగు మద్యం
దుకాణాలకు నోటిఫికేషన్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 28: మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు మంజూరు చేసేందుకు శనివారం జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విషయాన్ని మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ ఒక ప్రకటనలో తెలిపారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం, గూడూరు మండలం తరకటూరు, నందివాడ మండలం తమిరస, కృత్తివెన్ను మండలం నిడమర్రు దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందన్నారు.
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 2లోపు మచిలీపట్నంలోని ఎక్సైజ్ కార్యాలయంలో టెండర్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు.