కృష్ణ

కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో ముమ్మరంగా పుష్కర ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 6: వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు, భక్తులకు అవసరమైన వసతి, సదుపాయాల కల్పన కూడా వేగవంతమవుతున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నగరంలో జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తో కలిసి పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ ఈనెలాఖరు కల్లా అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో జరిగే కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. లక్షలు కాదు కోట్లాది మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన సకల సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో 18 మండలాల్లో, గుంటూరు జిల్లాలో 16, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కలిపి మొత్తం 36 మండలాల్లో నది ప్రవహిస్తున్నందున అన్ని చోట్ల పుష్కర ఘాట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దవి కలిపి మొత్తం 123 ఘాట్లు ఉండగా గుంటూరులో 95, కర్నూలులో 11 కలుపుకొని మొత్తం 225 ఘాట్లను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో విజయవాడ, వేదాద్రి, హంసలదీవి, మోపిదేవి, గుంటూరు జిల్లాలో అమరావతి, సీతానగరం, కర్నూలులో శ్రీశైలం, సంగమేశ్వరం లలో కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా నగర పరిధిలో వివిధ శాఖల వారు చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా నగర పాలక సంస్థ 367, రోడ్లు భవనాల శాఖ 138, ఇరిగేషన్ శాఖ 85, ఎండోమెంట్ తరఫున 485, ట్రాన్స్‌కో వారు 95 పనులను చేపట్టారని వివరించారు. నగరంలో సుమారు 5 కిలో మీటర్ల పొడవు మేర ఘాట్ల నిర్మాణం జరుగుతోందన్నారు. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పుష్కర ఘాట్లను పర్యాటక కేంద్రాలుగా నిలిచే విధంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 97 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 109 కి.మీ పొడవున రోడ్లను అభివృద్ది చేపట్టగా ఇప్పటికీ 16 రోడ్ల అభివృద్ధి పనులు పూర్తవ్వగా మిగిలినవి త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఈనెల 25నాటికల్లా అన్ని పుష్కర పనులు పూర్తిచేయుటకు విఎంసి ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పనులు మందగించిన ప్రస్తుతం వాతావరణం అనుకూలిస్తున్న మిగిలిన పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రోజుకు 25లక్షల మంది పుష్కర భక్తులు నగరానికి వస్తారన్న అంచనాలతో అందుకు అవసరమైన ఏర్పాట్లలో 24 పుష్కర నగర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ పుష్కరనగర్‌లలో మంచినీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే గదులు, తదితర వసతులను కల్పిస్తున్నామన్నారు. గోదారి పుష్కరాలకు సుమారు 2500 మొబైల్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయగా ప్రస్తుత కృష్ణా పుష్కరాలకు 5000 మొబైల్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఒకేసారి లక్ష వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు సరిపోయే విధంగా చేస్తున్న ఏర్పాట్లలో సుమారు 120 పార్కింగ్ ప్రదేశాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.