కృష్ణ

రెవెన్యూ సంస్కరణల విజయవంతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 6: భారతదేశంలో పరిష్కారం లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారధ్యంలో ఒకదాని వెంట మరొకటిగా వస్తున్న పెను సంస్కరణలు ప్రజలకు లబ్ది చేకూర్చేలా విజయవంతం చేయటానికి రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది తమ సర్వ శక్తులు ఒడ్డుతుంటే అనుమానాలు అపోహతో కొందరు వారిపై అవాస్తవ ప్రచారాన్ని సాగిస్తున్నారంటూ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపానులు, వరదలు, ఎక్కడ విపత్తు సంభవించినా తరలివెళ్లాలి. తాజాగా పట్టిసీమ పనుల్లోనూ రాత్రి పగలూ శ్రమించామన్నారు. చట్టప్రకారం ప్రతి 25 ఏళ్లకోసారి భూముల రీసర్వే జరగాల్సి ఉంటే గత 60 ఏళ్లుగా జరుగలేదన్నారు. దీనివల్ల ఒక వ్యక్తి పేరునున్న భూములు కుమారులు ఆపై మనుమళ్లకు కొద్ది కొద్దిగా మారుతుంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో తమ వద్ద నున్న రికార్డుల ఆధారంగా ఎంతో జాగ్రత్తగా వెబ్‌లాండ్ పోర్టర్‌లో అన్ని వివరాలను పొందుపరిచామన్నారు. గ్రామ సభల్లో ప్రజల నుంచి 13 లక్షల అర్జీలు రాగా వాటిల్లో 12 లక్షల అర్జీలను పరిష్కరించటం జరిగిందన్నారు. ప్రొటోకాల్ ఖర్చుల కింద తాజాగా ప్రభుత్వం రూ.19 కోట్లు విడుదల చేస్తే ఆ నిధులు ఏమయ్యాయో తెలియవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తాజాగా ఇ పాస్‌బుక్, ఇపోస్ విధానం, ఆధార్‌తో ఓటర్ల జాబితా. రేషన్ కార్డుల అనుసంధానం, ఇ-క్రాప్, ఇ-ఆఫీస్ వంటి అనేక పథకాలతో పనిభారం పెరిగి సతమతమవుతున్నా పనిచేస్తున్నామన్నారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎస్ అనిల్, విఆర్‌ఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.సత్యనారాయణ, విఆర్‌ఎల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కైకాల గోపాలరావు, అసోసియేషన్ నగర అధ్యక్ష కార్యదర్శులు డి.శ్రీనివాస్, ఆర్.రామకృష్ణ పాల్గొన్నారు.

ఏడో తరగతి విద్యార్థిపై
యువకుల లైంగిక దాడి
* వీడియో చిత్రీకరణ
పెనమలూరు, జూలై 6: మానవత్వం మంట కలిసిన వేళ ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడి చేసి కామవాంఛ తీర్చుకొని, ఆపై సంఘటనను తమ ఘనకార్యమన్నట్లు వీడియో చిత్రీకరించి స్నేహితులకు పంపించిన ఇద్దరు నరరూప రాక్షసుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రాగా బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎనికేపాడు పంచాయతీ పరిధి సుభాష్ చంద్రబోస్ కాలనీకి చెందిన ఒక 12 సంవత్సరాల విద్యార్థి నిడమానూరు హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు ఉదయం ఇంటి నుండి ఎనికేపాడు సెంటర్ బస్‌స్టాప్‌కు వచ్చి బస్సులో స్కూల్‌కి వెళ్లివస్తుంటాడు. గత నెల 22న ఉదయం స్కూల్‌కు వెళ్లడానికి రోడ్డుపై ఉండగా అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ, దుర్గా ప్రసాద్ అనే యువకులు స్కూల్ వద్ద దింపుతామని తమ వాహనంపై ఎక్కించుకుని కానూరు పంచాయతీ పరిధి వంద అడుగుల రోడ్డుకు తీసుకువచ్చారు. అక్కడ నుండి పంట పొలాల్లోకి తీసుకువెళ్లారు. బలవంతంగా పుస్తకాల సంచి లాక్కొని బట్టలు విప్పమన్నారు. ఆ బాలుడు తిరస్కరించడంతో కొట్టి నగ్నంగా చేసి లైంగిక దాడి చేశారు. పైశాచికత్వంగా కామవాంఛ తీర్చుకున్నారు. ఈ సంఘటనను తమ సెల్‌ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే వీడియో అందరికీ చూపెడతామని బెదిరించి పొలాల్లోనే ఆ బాలుడ్ని వదిలిపెట్టి పరారయ్యారు. కొంతసేపటికి తేరుకున్న బాలుడు స్కూల్ విడిచిపెట్టే సమయం వరకు అక్కడే గడిపి ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల అనంతరం స్కూల్‌కి వెళ్లటానికి రోడ్డుపైకి రాగా మరలా ఆ యువకులు బాలుడి వద్దకు వచ్చి చెప్పిన పని చేయకుంటే వీడియో బయటపెడతామంటూ బెదిరించి ఒక సైకిల్‌ను దొంగతనం చేయించారు. లైంగిక దాడికి పాల్పడ్డ యువకులు వీడియోను గ్రామంలోని తమ స్నేహితులకు బ్లూటూత్ ద్వారా పంపించడంతో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో పెనమలూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఆధారాలు సేకరించి నిందితులపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ దామోదర్ తెలిపారు.

పనుల్లో నాణ్యతనూ పర్యవేక్షించాలి
విజయవాడ (కార్పొరేషన్), జూలై 6: నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధిలోని పలుప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి పి నారాయణ, ఎంఎయుడి కమిషనర్ అండ్ డైరెక్టర్ కన్నబాబు లు సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతలను పర్యవేక్షించిన వారు అధికారుల తీరుపై కొద్దిపాటి అసహనాన్ని వ్యక్తం చేసి పనుల వేగవంతమే కాకుండా నాణ్యతలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బుధవారం ఉదయం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, కమిషనర్ వీరపాండియన్ తో కలిసి తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరపాలక సంస్థచే 35 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న వివిధ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ తొలుత ఎఎస్ రామారావు రోడ్డు,అమ్మ కల్యాణ మండపం రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు, ప్రభాస్ రోడ్డు, డోర్నకల్‌రోడ్డు, రామలింగేశ్వరనగర్, ఎన్‌టిఆర్ సర్కిల్, పటమట పంటకాల్వ రోడ్డు, ఆటోనగర్ రోడ్డు తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఐటిఐ కాలేజ్ వద్ద జరుగుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులపై నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించిన మంత్రి డ్రైయిన్ టు డ్రైయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తవ్వగానే ఆకర్షనీయమైన గ్రీనరీ, చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. మొగల్‌రాజపురం జమ్మి చెట్టు వీధిలో డ్రైయిన్‌ను పరిశీలించిన మంత్రి పూడిక తీత పనులపై ఎటువంటి అలక్ష్యం లేకుండా సరిచూడాలన్నారు. మధు చౌక్‌వద్ద కుంగిన కల్వర్టును చూసి తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. మొగల్‌రాజపురం, అమ్మ కల్యాణ మండపం రోడ్లలో నిర్మిస్తున్న అపార్టుమెంట్ల యజమానులు రోడ్డుకు మించి ర్యాంప్‌లు నిర్మించి ఉండటాన్ని గుర్తించిన నారాయణ తక్షణమే వాటిని తొలగించి రోడ్డు, రోడ్డు మార్జిన్లలో ఎటువంటి ఆక్రమణలు లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఈకార్యక్రమంలో విఎంసి సిఇ షుకూర్, ఇఇ ధనుంజయ, ఓంప్రకాష్, ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

జగ్జీవన్‌రామ్ సేవలు నిరుపమానం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 6: బాబు జగ్జీవన్‌రామ్ 30వ వర్ధంతి సందర్భంగా స్థానిక రామవరప్పాడులోని ఆయనన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు బుధవారం ఉదయం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివని అన్నారు. ప్రతిఒక్కరూ ఆయన బాటలో పయనించి దేశానికి పలు సేవలందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, నాయకులు విజయ్‌కుమార్, గాంధీ, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా పుష్కర ఏర్పాట్లపై పీఠాధిపతులతో చర్చించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 6: ఎంతో పవిత్రమైన కృష్ణా పుష్కరాల సందర్భంగా ముందుగా శృంగేరీ, కంచి వంటి ఇతర రాష్ట్రాల పీఠాధిపతులతో పాటు రాష్ట్రంలోని వివిధ పీఠాల అధిపతులను కూడా పిలిచి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమాలపై చర్చించి ఉంటే బాగుండేదంటూ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సరిగ్గా నెల రోజుల క్రితమే దేవాదాయ ధర్మాదాయ, రెవిన్యూ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్‌కు లేఖ రాశారు. అయితే నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కన్పించిన దాఖలాలు లేవు. మొత్తంపై ఆంధ్రభూమి దినపత్రిక ప్రతినిధి ఈ లేఖ కాపీని సంపాదించగల్గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పట్టిసీమ నుంచి గోదావరి జలాలను విడుదల చేసినప్పటికీ స్వామీజీ ఈ విషయాన్ని నెల రోజుల క్రితమే తన లేఖలో ప్రస్తావించారు. గోదావరి జలాలు కలిసేచోట ప్రకాశం బ్యారేజీ ఎగువన ఇబ్రహీంపట్నంలో ‘పవిత్ర సంగమం’ పేరిట అతి పొడవైన ఘాట్ల నిర్మాణం జరుగుతోందని, ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు’ అయితే ఈ సంగమ ప్రాంతం కృష్ణా పుష్కర స్నానాలకు ఏ మాత్రం పనికిరాదని స్వామీజీ ప్రస్తావించారు. అందుకే ఎగువ ప్రాంతాల్లో వేదాద్రి, అమరావతి తదితర ప్రాంతాల్లో తక్షణం ఏర్పాట్లు అవసరమని సూచించారు. పుష్కరాలు సమీపిస్తున్నా పీఠాధిపతులను ఆహ్వానించి కృష్ణాతీర ప్రాంతాల్లో చాతుర్మాస దీక్షను ఆచరించుటకు అవకాశం కల్పించి తగు సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారెవరూ తమలాంటి వారి సలహాలు తీసుకోరన్నారు. అసలే ఈ ఏడాది ఖగోళ శాస్త్ర ప్రకారం గ్రహాల పరిస్థితి అంత అనుకూలంగా లేదన్నారు. దోషాలు నివారించే విధంగా ఆలయాల్లో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.