కృష్ణ

రాష్ట్రంలో త్వరలో 35 మొబైల్ రైతుబజార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో రైతుబజార్లు వినూత్నమైనవి. దళారుల ప్రాబల్యాన్ని నిరోధించి రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేందుకు ఈ వ్యవస్థ 1999లోప్రారంభమైంది. అయితే మధ్యలో కొనే్నళ్లు రైతుబజార్లు నిర్లక్ష్యానికి గురైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుబజార్ల వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంది. 2016-17 బడ్జెట్లో రైతుబజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు కేటాయించారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు సరసమైన ధరలకు తమ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 35 మొబైల్ రైతుబజార్లను ప్రారంభించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనంతపురంలో రెండు, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేటల్లో ఒక్కొక్కటి వంతున మొబైల్ రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు తాజాగా కూరగాయలు విక్రయిస్తున్నారు. ఒక్కో మొబైల్ రైతుబజారుకు రూ.3.50 లక్షల వంతున 40 మొబైల్ రైతుబజార్లకు మొత్తం రూ.1.40 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఐదు మొబైల్ రైతుబజార్లకు ఆటోలు సమకూర్చారు. ‘్ఫమ్ టు హోం’ పేరిట దళారుల వ్యవస్థ లేకుండా వ్యవసాయ క్షేత్రం నుంచే నేరుగా ఇంటికి కూరగాయలు విక్రయించే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టు కార్యక్రమాలు ప్రారంభకానున్నాయి. రైతుబజార్లు లేని ప్రాంతాలు, జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి మొబైల్ రైతుబజార్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొబైల్ రైతుబజార్లలో భాగంగా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలను అందజేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 80 రైతుబజార్లు ఉన్నాయి. 34 రైతుబజార్లను పునర్నిర్మిస్తున్నారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లా మండపేట, పెద్దాపురం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, తణుకు, కృష్ణాజిల్లా కూచిపూడి, గుంటూరు జిల్లా పొన్నూరులో రైతుబజార్లు నెలకొల్పుతున్నారు. 80 రైతుబజార్లలో గరిష్టంగా కృష్ణా జిల్లాలో 17 రైతుబజార్లు వినియోగదారులకు సేవలందిస్తుండగా, మరో ఐదింటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 13 వంతున ఉండగా, తూర్పుగోదావరిలో ఎనిమిదింటికి, విశాఖపట్నం జిల్లాలో నాలుగు రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విజయనగరం జిల్లాలో నాలుగు రైతుబజార్లు వినియోగదారులకు సేవలందిస్తుండగా మరో ఆరింటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కర్నూలులో ఐదు రైతుబజార్లు ఉండగా మరో మూడు, శ్రీకాకుళంలో రెండు రైతుబజార్లు ఉండగా మరో రెండింటికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.