కృష్ణ

బ్లూ, గ్రీన్ సిటీగా ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 30: బ్లూ, గ్రీన్ సిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. బ్లూ అంటే నీరు అని, గ్రీన్ అంటే పచ్చదనం అని రెండూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. నగరంలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో శనివారం సాయంత్రం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాన్స్‌ఫార్మింగ్ విజయవాడ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యులైన విద్యార్థులకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఐదు ఉత్తమమైన రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమన్నారు. ఇందులో భాగంగా ‘మన విజయవాడ, మన రాజధాని’ భావనతో తీర్చిదిద్దుకోవాలనే స్ఫూర్తి విద్యార్థుల్లో రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. అద్భుతమైన రాజధానిని తీర్చిదిద్దే ప్రతిభ విద్యార్థుల్లో దాగి ఉందని ఈ సమాజంలో మార్పును తీసుకురాగల సత్తా విద్యార్థులకే ఉందని పేర్కొన్నారు. విజయవాడ నగరం నుండే నాగరికత ప్రారంభమైందని రాజకీయ చైతన్యం గల నగరంగా విజయవాడ పేరు ప్రఖ్యాతులు పొందిందన్నారు. ఒక ప్రశాంతమైన పోస్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అందరి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. 60 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దగలిగే ఆలోచన చేయగలిగినట్లయితే ఈనాటి అభివృద్ధి అందనంత ఎత్తుకు చేరుకునేదని ఊహించుకోవాలని విద్యార్థులతో అన్నారు. ఐటి ఇంక్యుబేటర్ కేంద్రాల ద్వారా యువతలోని ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ద్వారా స్టార్టప్ కంపెనీలను విద్యార్థులతోనే ఏర్పాటు చేయిస్తానన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు పర్యటించి అక్కడ అమలవుతున్న ఉత్తమమైన విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళికలను అధ్యయనం చేయటం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వనం - మనంలో విద్యార్థులు పాల్గొని విధిగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటటమే కాదని వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజును పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రత చేయడానికి ఉపయోగించాలన్నారు. ప్రతి శనివారం మధ్యాహ్నం నుండి నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయాలని సూచించారు. మొక్కలు నాటిన విద్యార్థులకు మార్కులు ఇవ్వనున్నట్లు, ఉద్యోగులకు ప్రమోషన్స్, బదిలీల్లో ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇది మనందరి బాధ్యతగా తీసుకుని ప్రస్తుతం 26 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, డెప్యూటీ మేయర్ జి.వెంకటరమణ, నాగార్జున వర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్రప్రసాద్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

వేటూరి పాట వెనె్నల తోట
మచిలీపట్నం (కల్చరల్), జూలై 30: ప్రముఖ సినీ రచయిత వేటూరి సుందర రామమూర్తి మాటలు, పాటలు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని సుప్రిసిద్ధ రంగస్థల నటులు బి పుల్లారావు అన్నారు. స్థానిక మహతి గ్రంథాలయంలో శనివారం వేటూరి సుందరరామమూర్తి సాహిత్య కృషి అనే అంశంపై సాహిత్య సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన పుల్లారావు మాట్లాడుతూ వేటూరి పాట వెనె్నల తోట అని అన్నారు. ఆయన పాటలు యువతరానికి గిలిగింతలు పెడతాయని, లోతైన ఆధ్యాత్మిక అనుభూతులను, బరువైన భావాలను అందిస్తాయన్నారు. ప్రముఖ సంగీత గాయని డా. చిత్రపు కిరణ్మయి మాట్లాడుతూ వేటూరి సరాగాల మాలికలను అందమైన హరివిల్లుగా అభివర్ణించారు. భవిష్య, ముక్తేవి రామకృష్ణ, ఎం నాగలింగశాస్ర్తీ, కాపవరపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాడులకు నిరసనగా ప్రదర్శన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 30: దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో స్థానిక కోనేరు సెంటరులో శనివారం ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా కెవిపిఎస్ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ గోసంరక్షణ సమితి ముసుగులో కొన్ని అరాచక శక్తులు దళితులపై చేస్తున్న దాడిపై పార్లమెంట్ సమావేశంలో ప్రస్థావించాలన్నారు. భూపోరాట కమిటీ కన్వీనర్ కొడాలి శర్మ మాట్లాడుతూ ఈ సమస్యపై రాష్టప్రతి జోక్యం చేసుకోవాలని కోరారు. కెవిపిఎస్ నాయకులు బి రామారావు, టి నాగేశ్వరరావు, తిలక్, రాంబాబు, యువకిషోర్, కొడాలి రమణ, తదితరులు పాల్గొన్నారు.